'ఎవడు తక్కువ కాదు' ట్రైలర్ లాంచ్ చేసిన సుకుమార్!

Published : Apr 29, 2019, 04:19 PM IST
'ఎవడు తక్కువ కాదు' ట్రైలర్ లాంచ్ చేసిన సుకుమార్!

సారాంశం

విక్రమ్ సహిదేవ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'ఎవడు తక్కువ కాదు'.

విక్రమ్ సహిదేవ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'ఎవడు తక్కువ కాదు'. 'ఎ స్టోరీ ఆఫ్ బ్రేవ్ హార్ట్'... ఉపశీర్షిక. లగడపాటి శిరీష సమర్పణలో రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి  శ్రీధర్ నిర్మించిన ఈ చిత్రానికి రఘు జయ దర్శకుడు. హరి గౌర సంగీత దర్శకుడు. ఇటీవల సినిమా సెన్సార్ పూర్తయింది. మే 11న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ సినిమా ట్రైలర్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ.. "ట్రైలర్ చాలా చాలా బావుంది. ఇది తమిళ సినిమా 'గోలి సోడా'కు రీమేక్. ఆ సినిమా చాలా బావుంటుంది. ట్రైల‌ర్‌తో పాటు నేను కొన్ని విజువ‌ల్స్ చూశా. విక్రమ్ చాలా చాలా బాగా చేశాడు. ఆర్టిస్టుగా 'రేసుగుర్రం', 'పటాస్', 'రుద్రమదేవి', 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాల్లో నటించాడు. ముఖ్యంగా 'నా పేరు సూర్య...' సినిమాలో అంత పెద్ద పాత్రను తన భుజాల మీద మోయడం, బాగా నటించడం గొప్ప విషయం. అప్పుడు విక్ర‌మ్‌కు 15 సంవత్సరాలు అంతే. ఇప్పుడు తనకు 17 ఏళ్ళు. ఇంకా ఇంటర్ పూర్తి కాలేదు. ఆర్టిస్టుగా సినిమా నుంచి సినిమాకు ఎదుగుతున్నాడు'' అన్నారు.

PREV
click me!

Recommended Stories

Dhurandhar Day 50 Collection: `బార్డర్ 2` దెబ్బకు ధురంధర్ ఆట క్లోజ్, 50 రోజుల కలెక్షన్లు
Ee Nagaraniki Emaindhi 2: శ్రీనాథ్ మాగంటికి బంపర్‌ ఆఫర్‌, ఈ నగరానికి ఏమైంది సీక్వెల్‌లో ఛాన్స్.. పాత్ర ఇదే