
‘సీతారామం’ సినిమాకు లాస్ట్ మినిట్ లో ఈ సినిమా దుబాయి రిలీజ్ కు సమస్యలు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ కాగా, గల్ఫ్ దేశాల్లో ఈ సినిమా రిలీజ్‌కు సెన్సార్ నో చెప్పింది. ఈ సినిమాలో మతపరమైన కొన్ని సీన్స్ ఉన్నాయని, అందువల్లే ఈ సినిమాను గల్ఫ్‌లో రిలీజ్ చేయొద్దంటూ సెన్సార్ తెలిపింది. ఈ క్రమంలో తమ సినిమాను గల్ఫ్ దేశాల్లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రీసెన్సార్ చేయించింది టీమ్. ఇప్పుడు అన్ని ఫార్మాలిటీస్ పూర్తి అయ్యి ఆగస్ట్ 11 న UAE లో భారీ గా రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ హిట్ టాక్ ఉంది కాబట్టి ఓపినింగ్స్ ఓ రేంజిలో ఉంటాయని భావిస్తున్నారు.
దుల్కర్ కు గల్ఫ్ దేశాల్లో మంచి మార్కెట్ ఉంది. సినిమా హిట్టైతే దాదాపు 25 కోట్లు వరకూ వసూలు చేస్తుంది. కురూప్ కు అక్కడ మంచి ఓపినింగ్స్, కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పటికే ఈ చిత్రం తెలుగు తో పాటు తమిళ, మలయాళ వెర్షన్స్ లోనూ చిత్రం విడుదల అయ్యింది.
ఇక 20 ఏళ్ళ క్రితం లెఫ్టినెంట్ రామ్ నాకో బాధ్యత అప్పగించారు. ఈ ఉత్తరాన్ని సీతామహాలక్ష్మికి నువ్వే చేర్చాలి’ అనే పాయింట్ చుట్టూనే సినిమా కథ నడుస్తుంది. ఆ ఉత్తరం పట్టుకొని జర్నలిస్ట్ ఆఫ్రిన్ (రష్మికా) ప్రయాణం మొదలు పెడుతుంది. పదిరోజుల్లో ఆ ఉత్తరం సీతకు అప్పగించడమే తన లక్ష్యం. అయితే ఆ పేరుతో ఎవరూ లేరని తెలుస్తుంది. అయినా సరే సీతకోసం అన్వేషణ మొదలవుతుంది. 1965 నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథ ఎంతో హృద్యంగా ఉంది.
ప్రకాష్ రాజ్, తరుణ్ భాస్కర్, మురళీ శర్మ, సుమంత్ , భూమిక ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాలోని చాలా భాగం కశ్మీర్ లో చిత్రీకరించారు. అలాగే.. కశ్మీర్ లోయలోని ప్రపంచంలోనే ఎత్తైన పోస్టాఫీస్ లో దుల్ఖర్ సల్మాన్ లెటర్స్ పోస్ట్ చేసే సన్నివేశాల్ని చిత్రీకరించారు. ఆ క్రమంలో చిత్ర యూనిట్ చాలా కష్టాలు పడిందని దర్శకుడు హను చెప్పాడు. యుద్ధానికి సిద్ధంగా ఉన్న ఒక యువకుడు ఒక అందమైన అమ్మాయి ప్రేమలో పడితే జరిగే పరిణామాల్ని.. ఈ సినిమాలో ఎంతో అందంగా చూపించారు. విశాల్ చంద్రశేఖర్ (Vishal Chandrasekhar) సంగీతం అందించిన ఈ పిరియాడికల్ లవ్ స్టోరీ కి ప్రేక్షకాదరణ బాగుంది.