సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా నీహారిక!

Published : Feb 15, 2019, 02:34 PM ISTUpdated : Feb 15, 2019, 02:35 PM IST
సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా నీహారిక!

సారాంశం

మొదటినుండి మెగా కాంపౌండ్ తో దర్శకుడు సుకుమార్ కి మంచి ర్యాపో ఉంది. అల్లు అర్జున్ తో ఆర్య, ఆర్య 2 సినిమాలు చేసిన సుకుమార్ రామ్ చరణ్ కి 'రంగస్థలం' లాంటి భారీ హిట్ సినిమా ఇచ్చాడు. 

మొదటినుండి మెగా కాంపౌండ్ తో దర్శకుడు సుకుమార్ కి మంచి ర్యాపో ఉంది. అల్లు అర్జున్ తో ఆర్య, ఆర్య 2 సినిమాలు చేసిన సుకుమార్ రామ్ చరణ్ కి 'రంగస్థలం' లాంటి భారీ హిట్ సినిమా ఇచ్చాడు. ఇప్పుడు వైష్ణవ్ తేజ్ తో సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై సినిమా తీస్తున్నారు.

ఇటీవల ఈ సినిమా పట్టాలెక్కింది. సుకుమార్ శిష్యుడు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే కథ, మాటలు అన్నీ మాత్రం సుకుమార్ అందించినవే. ఇంకా ఈ సినిమా పూర్తి కాకముందే ఇప్పుడు నీహారిక కొణిదలతో తన బ్యానర్ లో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమాకి కూడా సుకుమార్ శిష్యులలో ఒకరు దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈ సినిమాకి కూడా కథ, స్క్రీన్ ప్లే సుకుమార్ అందించనున్నాడు. గీతాఆర్ట్స్ లేదా అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ లలో సినిమాను నిర్మించే అవకాశాలు కనిపిస్తున్నాడు. 

సుకుమార్ కూడా నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరించనున్నాడు. డైరెక్టర్ గా ఇప్పటివరకు తన తదుపరి సినిమాపై క్లారిటీ ఇవ్వనప్పటికీ.. నిర్మాతగా మాత్రం తెగ బిజీ అయిపోతున్నాడు.  

PREV
click me!

Recommended Stories

Padma Awards 2026: మమ్ముట్టికి పద్మభూషణ్, ధర్మేంద్రకి పద్మ విభూషణ్.. రొమాంటిక్ హీరోకి కూడా అవార్డు
Nithiin: ఏడు ఫ్లాపుల తర్వాత తేరుకున్న నితిన్.. సైన్స్ ఫిక్షన్ కథతో పెద్ద ప్రయోగం