సంక్రాంతి బాక్సాఫీస్ పోరు.. ఎవరిది పైచేయి..?

By AN TeluguFirst Published Jan 13, 2020, 11:33 AM IST
Highlights

'అల వైకుంఠపురంలో' సినిమా కేవలం 14 డాలర్ల టికెట్ రేటుతో ప్రీమియర్ షోలతో ఏకంగా 8 లక్షలకి పైగా డాలర్లని సంపాదించింది. అంతకు ఒక రోజు ముందు విడుదలయిన మహేష్ బాబు సినిమా 20 డాలర్ల టికెట్ ధరతో ప్రీమియర్ షోలతో 7 లక్షల 60 వేలని పొందింది. 

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో, ఫ్యాన్స్ డిస్కషన్స్ లో ఒకటే హాట్ టాపిక్. అదేమిటంటే...అమెరికాలో ఈ సారి ఏ హీరో ఎక్కువ వసూలు చేస్తారు..ఎవరిది పై చేయి అని. చాలా మంది చాలాకాలంగా యుఎస్ మార్కెట్ లో ప్రిన్స్ అనిపించుకున్న మహేష్ కే ఓటేసారు. అయితే ఎవరూ ఊహిందనది జరిగింది.  మహేష్ బాబు సినిమా సరిలేరు నీకెవ్వరుని మించి అల్లు అర్జున్ నటించిన మూవీ ఎక్కువ ఓపెనింగ్ తెచ్చుకుంటుంది. ఇది ఎవరూ ఎక్సపెక్టే చేయలేదు.

"అల వైకుంఠపురంలో" సినిమా కేవలం 14 డాలర్ల టికెట్ రేటుతో ప్రీమియర్ షోలతో ఏకంగా 8 లక్షలకి పైగా డాలర్లని సంపాదించింది. అంతకు ఒక రోజు ముందు విడుదలయిన మహేష్ బాబు సినిమా 20 డాలర్ల టికెట్ ధరతో ప్రీమియర్ షోలతో 7 లక్షల 60 వేలని పొందింది. దీన్ని బట్టి  తేలిందేమిటంటే.. "అల వైకుంఠపురంలో  ఎక్కువ కలెక్ట్ చేయటమే కాదు ఎక్కువ మంది ప్రేక్షకులని థియేటర్లకు రప్పించింది.

'పండగపూట ఏమిటీ దరిద్రం...' సమంత డ్రెస్ పై ఘోరంగా ట్రోల్స్!

"అల వైకుంఠపురంలో చిత్రానికి తక్కువ రేటు పెట్టడం ఒక అడ్వాంటేజ్ అయింది.యూఎస్ ప్రీమియర్స్ చూసిన వారందరూ సినిమాపై పాజిటివ్ టాక్ సోషల్ మీడియా వేదికగా స్ప్రెడ్ చేస్తున్నారు.దానికి తోడు త్రివిక్రమ్ బ్రాండ్ నేమ్ బాగా ప్లస్  అయ్యాయి.  అల్లు అర్జున్ కెరీర్లో ఏ సినిమా కూడా 4 లక్షలని మించి ప్రీమియర్ షో వసూళ్లు పొందలేదు. రివ్యూలు, టాక్ పాజిటివ్ గా ఉన్నాయి. కాబట్టి అమెరికాలో ఈ సినిమా బాగా వసూలు చేస్తుందనటంలో సందేహం లేదు.
 
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజ హెగ్డే నటించారు. టబు, సుశాంత్, నివేదా పేతురాజ్ ఇతర కీలక పాత్రలు చేయడం జరిగింది. అల వైకుంఠపురంలో చిత్రానికి సంగీతం థమన్ అందించారు.

click me!