'అల.. వైకుంఠపురములో' ఫస్ట్ డే కలెక్షన్లు!

By AN TeluguFirst Published Jan 13, 2020, 10:20 AM IST
Highlights

ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు ఈ సినిమా రూ.45 కోట్ల గ్రాస్ ని వసూలు చేసినట్లు ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. షేర్ రూ.30 కోట్ల వరకు రాబట్టిందని అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక లెక్కలు రావాల్సివుంది. 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'అల.. వైకుంఠపురములో' సినిమా సంక్రాంతి కానుకగా ఆదివారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పూజాహెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేశారు. తొలి షో నుండే ఈ సినిమా హిట్ టాక్ దక్కించుకుంది. ఫస్ట్ డే కలెక్షన్స్ తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది.

అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' రివ్యూ

ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు ఈ సినిమా రూ.45 కోట్ల గ్రాస్ ని వసూలు చేసినట్లు ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. షేర్ రూ.30 కోట్ల వరకు రాబట్టిందని అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక లెక్కలు రావాల్సివుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా దాదాపు రూ.20 కోట్లు, ఓవర్సీస్ లో రూ.5 కోట్లు, కేరళ ఇతర రాష్ట్రాల్లో కలిపి మూడున్నర కోట్లకు పైగానే వసూలు చేసినట్లు తెలుస్తోంది. 

ఏరియాల వారీగా ఏపీ, తెలంగాణాలో సినిమా కలెక్షన్లు..

నైజాం............................................. రూ.5 కోట్లు 
సీడెడ్.............................................. రూ.2.5 కోట్లు 
ఉత్తరాంధ్ర..................................... రూ.2 కోట్లు 
ఈస్ట్, వెస్ట్......................................... రూ.4.5 కోట్లు 
గుంటూరు....................................... రూ.3 కోట్లు 
కృష్ణా, నెల్లూరు............................... రూ.3 కోట్లు 

ఓవరాల్ గా సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.20 కోట్లకు దగ్గరగా వసూలు చేసిందని సమాచారం. 

click me!