లైగర్ భారీ నష్టంతో .... డైరెక్టర్ పూరి జగన్నాథ్ రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అవేమిటంటే...
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ - దర్శకుడు పూరిజగన్నాథ్ ల తొలి కలయికలో రూపొందిన పాన్ ఇండియా మూవీ `లైగర్`. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షోనే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుని షాకిచ్చిన సంగతి తెలసిందే. ఈ సినిమా పై దర్శకుడు పూరి జగన్నాథ్ హీరో విజయ్ దేవరకొండ భారీ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు. సినిమా భారీ స్థాయిలో వసూళ్లని రాబడుతుందని కోట్లు కుమ్మరిస్తుందని ఆశించారు. ఆ కారణంగానే ఈ మూవీని భారీ రేట్లకు బయ్యర్లకు అమ్మారు. అయితే మేకర్స్ భారీ స్థాయిలో డిమాండ్ చేయడంతో కొంత మంది బయ్యర్లు వెనక్కి తగ్గారు. అయితే కొంత మంది మాత్రం భారీ మొత్తాన్ని చెల్లించి సొంతం చేసుకున్నారు.
ట్రేడ్ రిపోర్ట్స్ లైగర్ చిత్రం ఏడవ రోజు ఇండియాలో రూ. 90 లక్షలు మాత్రమే వసూలు చేసింది. దీంతో మేకర్స్ డీలా పడ్డారు. మరోవైపు పలు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కొన్ని పాన్ ఇండియా సినిమాలు కూడా రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో 'లైగర్' సినిమాను కొన్ని రోజుల్లోనే థియేటర్ల నుంచి పూర్తిగా తొలిగించే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. 'లైగర్' సినిమా కోసం విజయ్ దేవరకొండ మూడేళ్లు కష్టపడ్డారు. కానీ విజయ్ శ్రమ వృథా అయిపోయింది. నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు లైగర్ చిత్రం భారీ నష్టాలను మిగిల్చింది.
ఇప్పుడు తిరిగి ఇవ్వాల్సిన సమయం వచ్చింది. వరంగల్ శ్రీను నైజాం ఏరియా హక్కుల్ని భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకున్నారు. దిల్ రాజు ఎన్ వీ ప్రసాద్ తో పాటు పలువురు ఇతర ఏరియాల కోసం భారీగానే చెల్లించారు. అయితే ఇప్పడు వారికి `లైగర్` డిజాస్టర్ తో భారీ నష్టాలు కనపడుతున్నాయి. ఆ నష్టాలని తిరిగి చెల్లించాల్సిందేనని దర్శకుడు పూరి జగన్నాథ్ని కలిసిశారని టాక్.
ఈ నేపధ్యంలో లైగర్ వల్ల నష్టపోయిన కొనుగోలుదారులకు పరిహారం తమ తదుపరి చిత్రం జనగణమన తో చెల్లించాలని ఆలోచనలో ఉన్నారట. లైగర్ సినిమా షూటింగ్ టైమ్ లోనే పూరి – విజయ్ దేవరకొండ కాంబినేషన్లో జనగణమన అనే చిత్రాన్ని ప్రకటించారు. కాగా ఆ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కించాలని కూడా ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద లైగర్ దారుణమైన పరాజయం పాలైన దశలో.. ఆ సినిమాను కొన్న బయ్యర్లకు నష్టపరిహారం ఇవ్వడానికి జన గణ మన సినిమాని వీలయినంత తక్కువ బడ్జెట్‌లో తీయడంతో పాటు.. పూరి, విజయ్ లు రెమ్యునరేషన్ లేకుండా జన గణ మన సినిమాని తెరకెక్కించి విడుదల చేయాలని అనుకుంటున్నారని మీడియా వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే అందుకు ఆ నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ ఒప్పుకోవాలి మరి.