క్రేజీ హీరోయిన్ ఇలా అయిపోయిందేంటి.. అనారోగ్యమా?

Published : Jan 07, 2020, 05:30 PM IST
క్రేజీ హీరోయిన్ ఇలా అయిపోయిందేంటి.. అనారోగ్యమా?

సారాంశం

హృతిక్ రోషన్ నటించిన వార్ మూవీ రిలీజ్ ముందు వరకు వాణి కపూర్ కు అంతగా క్రేజ్ లేదు. వార్ మూవీ సూపర్ హిట్ కావడంతో వాణి కపూర్ క్రేజీ బ్యూటీగా మారిపోయింది.

హృతిక్ రోషన్ నటించిన వార్ మూవీ రిలీజ్ ముందు వరకు వాణి కపూర్ కు అంతగా క్రేజ్ లేదు. వార్ మూవీ సూపర్ హిట్ కావడంతో వాణి కపూర్ క్రేజీ బ్యూటీగా మారిపోయింది. వార్ చిత్రంలో గ్లామర్, డాన్స్, నటన ఇలా అన్ని అంశాల్లో వాణి అదరగొట్టేసింది. 

బికినిలో సైతం మెరిసి హీటెక్కించింది. వార్ మూవీ హిట్ కావడంతో వాణికపూర్ కు ప్రస్తుతం మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. వాణి కపూర్ కమర్షియల్ చిత్రాలకు అనుగుణంగా నాజూకైన అందం మైంటైన్ చేస్తోంది. వాణి కపూర్ ఫిట్నెస్ విషయంలో చాలా కేర్ తీసుకుంటుంది. తరచుగా వాణి కపూర్ జిమ్ లో కసరత్తులు చేస్తున్న దృశ్యాలని అభిమానులతో పంచుకుంటోంది. 

ఇటీవల వాణి కపూర్ మరింతగా సన్నబడింది. ఇటీవల వాణి కపూర్ సోషల్ మీడియాలో మొబైల్ పట్టుకుని ఉన్న పిక్ ని షేర్ చేసింది. ఈ ఫోటోని 2 లక్షల మందికి పైగా లైక్ చేశారు. కానీ మరికొందరు మాత్రం వాణి కపూర్ మరీ సన్నగా కనిపిస్తుండడంతో నెగిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. 

ఆ స్టెప్పుతో ట్రెండ్ సెట్ చేయబోతున్న అల్లు అర్జున్

వాణి కపూర్ ఇలా అయిపోయిందేంటి.. ఆమెకు అనారోగ్యమా అని కొందరు కామెంట్స్ చేస్తుంటే.. పోషకాహార లోపం అంటే ఇదే.. ఇలా సన్నగా అయిపోతారు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ పై వాణి కపూర్ ఘాటుగా స్పందించింది. 

బండ్ల గణేష్ నెక్స్ట్ టార్గెట్ అదేనా.. పబ్లిక్ గా కామెంట్స్!

ద్వేషాన్ని పెంచుకోకండి.. ఉపయోగపడే పని ఏదైనా చేసుకోండి అని వాణి కపూర్ తనని ట్రోల్ చేస్తున్న వారిపై మండిపడింది. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?