స్టైలిష్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ 'అల వైకుంఠపురములో'. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. అన్ని కార్యక్రమాలని పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కు రెడీ అవుతోంది.
స్టైలిష్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ 'అల వైకుంఠపురములో'. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. అన్ని కార్యక్రమాలని పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లోకి అల వైకుంఠపురములో మ్యూజికల్ కన్సర్ట్ పేరుతో భారీ ఈవెంట్ నిర్వహిస్తున్నారు.
ఈవెంట్ ప్రారంభానికి ముందు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ ఇంటర్వ్యూలో అల వైకుంఠపురములో చిత్రానికి మ్యూజికల్ కన్సర్ట్ నిర్వహించడానికి గల కారణాన్ని వివరించారు. సాధారణంగా ప్రస్తుతం అన్ని చిత్రాల రిలీజ్ కు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. దీనిపై త్రివిక్రమ్ క్లారిటీ ఇచ్చారు. అల వైకుంఠపురములో చిత్ర సంగీతంలో క్లాసికల్ టచ్ ఉంది. అంతా మన సంప్రదాయ సంగీతాన్ని మరచిపోతున్న రోజులో తమన్ అద్భుతమైన మ్యూజిక్ అందించాడు.
undefined
ప్రేక్షకులు కూడా అంతే బాగా రిసీవ్ చేసుకున్నారు. సామజవరగమన సాంగ్ అయితే ఒక యాన్తంలాగా మారిపోయింది. అలాంటప్పుడు సంగీతం పేరు మీదే ఈవెంట్ నిర్వహిస్తే ఎలా ఉంటుంది అనే ఐడియాని బన్నీ ఇచ్చాడు. అల వైకుంఠపురములో మ్యూజికల్ కన్సర్ట్ ఐడియా బన్నీదే అని త్రివిక్రమ్ అన్నారు.
శ్రీదేవి మృతికి అసలు కారణం ఇదా? బయటపడ్డ నమ్మలేని నిజం!
ఇక ఈ చిత్రంలో శ్రీకాకుళం స్టైల్ లో సాగే మరో సాంగ్ కూడా ఉంది. సినిమా రిలీజ్ అయ్యాక ఆ సాంగ్ చూసి ప్రేక్షకులు సర్ ప్రైజ్ అవుతారని త్రివిక్రమ్ అన్నారు. అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో సుశాంత్, నివేత పేతురాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. సీనియర్ నటి టబు ఈ చిత్రంతో చాలా కాలం తర్వాత తెలుగులోకి రీఎంట్రీ ఇస్తున్నారు.
కష్టాల్లో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' నటుడు.. ఆదుకున్న బాలకృష్ణ!