మంచు విష్ణు ప్రపోజల్ కు నరేంద్ర మోడీ ఓకే.. గుడ్ న్యూస్ ఇదే!

Published : Jan 06, 2020, 06:38 PM ISTUpdated : Jan 06, 2020, 06:40 PM IST
మంచు విష్ణు ప్రపోజల్ కు నరేంద్ర మోడీ ఓకే.. గుడ్ న్యూస్ ఇదే!

సారాంశం

మోహన్ బాబు కుటుంబం సోమవారం రోజు భారత ప్రధాని నరేంద్ర మోడీతో ఢిల్లీలో భేటీ అయ్యారు. దీనిపై రాజకీయంగా చాలా చర్చ జరుగుతోంది. పాలిటిక్స్ ని కాస్త పక్కన పెడితే.. దక్షణాది చిత్ర పరిశ్రమకు మంచి విష్ణు ఓ గుడ్ న్యూస్ వినిపించారు.

మోహన్ బాబు కుటుంబం సోమవారం రోజు భారత ప్రధాని నరేంద్ర మోడీతో ఢిల్లీలో భేటీ అయ్యారు. దీనిపై రాజకీయంగా చాలా చర్చ జరుగుతోంది. పాలిటిక్స్ ని కాస్త పక్కన పెడితే.. దక్షణాది చిత్ర పరిశ్రమకు మంచి విష్ణు ఓ గుడ్ న్యూస్ వినిపించారు. దక్షణాది సినీ ప్రముఖులతో సమావేశం అయ్యేందుకు మోడీ అంగీకరించారని విష్ణు తన ట్వీటర్ లో ప్రకటించాడు. 

మోహన్ బాబు, మంచు లక్ష్మీ, మంచు విష్ణు, విరోనిక ప్రధానితో సమావేశం అయ్యారు. 15 నిమిషాల పాటు మోడీతో వీరి సమావేశం జరిగింది. ప్రధానితో భేటీ విశేషాలని విష్ణు సోషల్ మీడియాలో పంచుకున్నాడు. 'మన ప్రధానితో అద్భుతమైన సమావేశం జరిగింది. ఆయనకు మహావిష్ణు దశావతారాలు ఉన్న పెయింటింగ్ ని గిఫ్ట్ గా అందించాం. మరో పెయింటింగ్ లో ఆయన ఆటోగ్రాఫ్ తీసుకున్నాం. 

ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. నేను వ్యక్తిగతంగా మోడీ గారికి ఓ రిక్వస్ట్ చేశాను. సౌత్ సినీ ప్రముఖులతో సమావేశం కావాలని కోరాను. అందుకు మోడీ వెంటనే అంగీకరించారు. త్వరలోనే ఈ సమావేశం ఉంటుందని భావిస్తున్నా అని మంచు విష్ణు ట్వీట్ చేశారు. 

గతంలో మోడీ నిర్వహించిన ఓ కార్యక్రమానికి కేవలం బాలీవుడ్ ప్రముఖులని మాత్రమే ఆహ్వానించారు. ఆ సమయంలో విమర్శలు చెలరేగాయి. దక్షణాది చిత్ర పరిశ్రమని మరచిపోయారా అంటూ ఉపాసన, ఖుష్బూ విమర్శించారు. మోడీతో మంచు ఫ్యామిలీ సమావేశం అయినా దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

 

కష్టాల్లో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' నటుడు.. ఆదుకున్న బాలకృష్ణ! 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?