Manchu Manoj : గుడ్ న్యూస్ చెప్పిన మంచు మనోజ్, ప్రమోషన్ వచ్చిదంటూ.. ఎమోషనల్ పోస్ట్..

Published : Dec 17, 2023, 07:48 AM ISTUpdated : Dec 17, 2023, 07:50 AM IST
Manchu Manoj : గుడ్ న్యూస్ చెప్పిన మంచు మనోజ్, ప్రమోషన్ వచ్చిదంటూ.. ఎమోషనల్ పోస్ట్..

సారాంశం

అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు మంచు హీరో మనోజ్. తనకుతండ్రిగా ప్రమోషన్ వచ్చిదంటూ తెగ సంబరపడిపోతున్నాడు. ఈక్రమంలో ఓ ఎమోషనల్ పోస్ట్ ను కూడా శేర్ చేసుకున్నారు మంచు మనోజ్.   

మంచు ఫ్యామిలీ నుంచి హీరో అయినా.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సాధించుకున్ాడు మనోజ్.  వీరి కుటుంబంలో అందరు స్టార్లు ట్రోల్స్ కు గురయినా.. మనోజ్ పై మాత్రం ఆ ప్రభావం ఉండదు. ఇక తన నిర్ణయాలు కూడా సంచలనంగా ఉంటాయి. నిక్కచ్చిగా ఉండటంతో పాటు.. ఇండస్ట్రీలో స్టార్స్ తో మంచి అనుబంధం కూడా కొనసాగిస్తున్నారు మనోజ్. పెళ్లి.. వీడాకుల తరువాత ఎప్పటి నుంచో తాను ప్రేమిస్తున్న పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన భూమా మౌనికను పెళ్లాడి సంచలనం సృష్టించాడు మనోజ్.  అటు మౌనికకు కూడా ఇది రెండో వివాహం కావడం విశేషం. 

ఇక మంచు ఫ్యామిలీలో ఈ పెళ్ళి ఇష్టం లేకపోయినా.. అందరిని ఒప్పించి పెళ్ళాడాడు మనోజ్. ఇక మౌనికతో హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తున్నాడు. మౌనికకు అంతకు ముందే ఓ కొడుకు ఉండగా.. తన సొంత బిడ్డలా చూసుకుంటున్నాడు మనోజ్. ఇక తాజాగా మనోజ్ ఓ గుడ్ న్యూస్ ను పంచుకున్నాడు. తాను తండ్రి కాంబోతున్నట్టు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు మనోజ్.  తన ఫ్యాన్స్ కి ఓ శుభవార్త చెప్పారు. తన భార్య భూమ మౌనిక రెడ్డి తల్లి కాబోతుందంటూ అనౌన్స్ చేశాడు. . ఈ సందర్భంగా తన అత్త మామలను తలుచుకుంటూ.. ఎమోషనల్ అయ్యాడు మనోజ్. 

 

ఇక మంచు మనోజ్ ఈ న్యూస్ ను అనౌన్స్ చేస్తూ..తన అత్త శ్రీమతి శోభా నాగిరెడ్డి పుట్టిన రోజు సందర్బంగా ఆమెను స్మరించుకుంటూ  ఎమోషనల్ నోట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు..  ఓ సంతోషకరమైన వార్త చెప్పాలనుకుంటున్నా అంటూ.. ‘అత్తమ్మ.. భూమా నాగి రెడ్డి మామయ్య మీరు మరోసారి అమ్మమ్మ, తాత అవుతున్నారు. మాచిన్న ధైరవ్ పెద్ద అన్న అవుతున్నందుకు థ్రిల్‌గా ఉన్నాడు. ఎదుగుతున్న మా కుటుంబాన్ని అంతులేని ప్రేమతో మీరు చూస్తూనే ఉంటారనీ, రక్షిస్తారని, ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాను. మా అమ్మ నిర్మల, నాన్న మోహన్ బాబు ఆశిస్సులతో.. మా కుటుంబం చాలా సంతోషంగా ఉంది అంటూ ట్విట్టర్ వేదికగా ప్రస్తావించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?