MAA Elections: పలుకుడితో ఓటర్లకు ప్రలోభాలు.. జీవితా రాజశేఖర్‌పై థర్డీ ఇయర్స్ పృథ్వీ ఫిర్యాదు

Siva Kodati |  
Published : Sep 23, 2021, 04:24 PM IST
MAA Elections: పలుకుడితో ఓటర్లకు ప్రలోభాలు.. జీవితా రాజశేఖర్‌పై థర్డీ ఇయర్స్ పృథ్వీ ఫిర్యాదు

సారాంశం

మా ఎన్నికల్లో మెంబర్స్‌ను తన పలుకుడితో ప్రభావితం చేసేందుకు జీవితా రాజశేఖర్ ప్రయత్నిస్తున్నారని థర్డ్ ఇయర్స్ పృథ్వీ ఆరోపించారు. తనకు ఓటేస్తే టెంపరరీ ఐడీ కార్డులు ఇప్పిస్తానంటూ జీవిత హామీ ఇస్తున్నారని పృథ్వీ అన్నారు. ఈ వ్యవహారంలో విచారణకు ఆదేశించాలని ఎన్నికల అధికారిని ఫిర్యాదులో కోరారు  

మా ఎన్నికల నేపథ్యంలో జీవితా రాజశేఖర్‌పై కమెడియన్ పృథ్వీరాజ్ ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ తరపున పోటీ చేస్తున్న ఆమెపై మా అసోసియేషన్ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు పృథ్వీరాజ్. ప్రచారంలో ఎన్నికల నియమావళికి విరుద్ధంగా జీవిత మాట్లాడుతున్నారని పృథ్వీ ఆరోపించారు. మెంబర్స్‌ను తన పలుకుడితో ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన చెప్పారు. తనకు ఓటేస్తే టెంపరరీ ఐడీ కార్డులు ఇప్పిస్తానంటూ జీవిత హామీ ఇస్తున్నారని పృథ్వీ  ఆరోపించారు. ఈ వ్యవహారంలో విచారణకు ఆదేశించాలని ఎన్నికల అధికారిని ఫిర్యాదులో కోరారు. 

మరోవైపు గురువారం తన ప్యానెల్ సభ్యుల వివరాలను ప్రకటించారు హీరో మంచు విష్ణు. మొత్తం 27 మంది సభ్యులతో కూడిన మంచు విష్ణు ప్యానెల్ లో మంచు విష్ణు అధ్యక్ష పదవికి పోటీపడుతున్నారు.  రఘుబాబు జనరల్ సెక్రటరీ, బాబు మోహన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, మాదాల రవి, థర్టీ ఇయర్స్ పృథ్వి వైస్ ప్రెసిడెంట్స్ గా, గౌతమ్ రాజు, కరాటే కళ్యాణి జాయింట్ సెక్రెటరీలు గా, ఇక శివ బాలాజీ ట్రెజరీ పదవికి పోటీ పడనున్నారు. 

ఇక ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా అర్చన, అశోక్ కుమార్, గీతా సింగ్, హరినాథ్ బాబు, జయవాణి, శైలజ, మాణిక్, పూజిత, సంపూర్ణేష్ బాబు, రాజేశ్వరి రెడ్డి, రేఖ, శశాంక్, శివన్నారాయణ,శ్రీలక్ష్మి, శ్రీనివాసులు పి, స్వప్న మాధురి, విష్ణు బొప్పన, వడ్లపట్ల ఎమ్ ఆర్ సి ఉన్నారు. 

Also Read:మా ఎన్నికల హీట్: గట్టిపోటీ దారులతో మంచు విష్ణు ప్యానెల్.. పోటీ రసవత్తరం!

మంచు విష్ణుకు ప్రధాన పోటీదారుగా ఉన్న ప్రకాష్ రాజ్ సైతం 27మంది సభ్యులతో కూడిన ప్యానెల్ ప్రకటించారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ నందు జయసుధ, సాయి కుమార్, బెనర్జీ, శ్రీకాంత్, అనసూయ, సుడిగాలి సుధీర్ వంటి ప్రముఖులు సభ్యులుగా ఉన్నారు. ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ మంచు విష్ణుకు మద్దతు ప్రకటించగా, మెగా ఫ్యామిలీ నుండి నాగబాబు ప్రకాష్ రాజ్ కి గట్టి సప్పోర్ట్ గా నిలుస్తున్నారు. ఈ సారి ఇద్దరి గట్టి పోటీదారుల మధ్య పోరు రసవత్తరంగా జరగనున్నట్లు అర్థం అవుతుంది.
 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?