సూపర్ హిట్ చిత్రాల దర్శకుడుకి గుండెపోటు,కండీషన్ సీరియస్

Published : Aug 08, 2023, 06:33 AM IST
సూపర్ హిట్ చిత్రాల దర్శకుడుకి గుండెపోటు,కండీషన్ సీరియస్

సారాంశం

ప్రస్తుతం సిద్దిక్‌కు ఎక్స్‌ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ (ఈసీఎంఓ) మెషిన్ సపోర్ట్ అందుతున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. 


మలయాళంలో హిట్లర్‌, గాడ్‌ఫాదర్‌, ఫ్రెండ్స్‌, బాడీగార్డ్‌ సినిమాలను తెరకెక్కించి సూపర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు సిద్దిఖీ. ఆయన గుండెపోటుతో కొచ్చిలోని ఆసుపత్రిలో చేరారు. 69 ఏళ్ల ఈ దర్శకుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు  వార్తలు వస్తున్నాయి. నిన్న మధ్యాహ్నం మూడు గంటల సమయంలో గుండెపోటు వచ్చినట్లుగా తెలుస్తోంది. అతనికి కొచ్చిలోని అమృత ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

మళయాళ మీడియా నుంచి అందుతున్న సమాచారం మేరకు ...సిద్ధిక్ న్యుమోనియా, కాలేయ వ్యాధి కారణంగా వైద్య సంరక్షణలో ఉన్నారు. ఈ అనారోగ్యాలతో చికిత్స కొనసాగుతుండగానే గుండెపోటుకు గురయ్యాడు. ప్రస్తుతం సిద్దిక్‌కు ఎక్స్‌ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ (ఈసీఎంఓ) మెషిన్ సపోర్ట్ అందుతున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయడానికి  ఈ రోజు ఉదయం మెడికల్ బోర్డు సమావేశం కానుందని తెలుస్తోంది.

సిద్దిఖీ ఆస్పత్రిలో చేరారన్న వార్తతో ఆందోళనకు లోనవుతున్నారు అభిమానులు. తమ అభిమాన దర్శకుడు త్వరగా కోలుకోవాలని  ప్రార్థిస్తున్నారు. సిద్దిఖీ తెలుగులో నితిన్‌తో మారో సినిమా తెరకెక్కించాడు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్‌ అందుకోలేకపోయింది. 

 సిద్ధిక్ పప్పన్ ప్రియప్పేట్టా పప్పన్ సినిమాకు కథ రాశాడు. ఆ తర్వాత రామ్ జీ రావ్ స్పీకింగ్, ఇన్ హరిహర నగర్, గాడ్ ఫాదర్, వియత్నామ్ కాలనీ, కాబీలీవాలా తదితర చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. 
 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?