చిరంజీవి, బాలకృష్ణలతో మాట్లాడాం, దాసరి చాలా పెట్టారు: తమ్మారెడ్డి

By telugu teamFirst Published May 30, 2020, 12:59 PM IST
Highlights

గతంలో దాసరి నారాయణ రావు చాలా సమావేశాలు పెట్టారని, ఆ సమావేశాలపై ఎవరూ మాట్లాడలేదని, ఇప్పుడు చిరంజీవి నివాసంలో సమావేశాలు పెడితే ఎందుకు అభ్యంతరం చెబుతున్నారని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.

హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో తాజాగా చోటు చేసుకున్న వివాదంపై తెలుగు సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణ రావు వర్ధంతి సభలో ఆయన మాట్లాడారు. దాసరి నారాయణ రావు గతంలో చాలా సమావేశాలు నిర్వహించారని, అప్పుడు ఏ విధమైన వివాదాలు కూడా చోటు చేసుకోలేదని ఆయన గుర్తు చేశారు. 

దాసరి నిర్వహించినప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడు చిరంజీవి నివాసంలో జరిగే సమావేశాలకు ఎందుకు అభ్యంతరం తెలుపుతున్నారని ఆయన అడిగారు. నాగబాబు, బాలకృష్ణలు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. చిరంజీవి, బాలకృష్ణలతో మాట్లాడామని, సమస్య సద్దుమణిగిందనే అనుకుంటున్నామని ఆయన అన్నారు. సినీ పరిశ్రమ కోసమే చిరంజీవి నివాసంలో సమావేశాలు జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. 

Also Read: `సారి కావాలా రా`.. సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న బాలయ్య ఫ్యాన్స్

కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమ కార్యకలాపాలన్నీ ఆగిపోయాయి. గత రెండు నెలలుగా సినీ పరిశ్రమలో ఏ విధమైన కార్యకలాపాలు కూడా సాగడం లేదు. ఈ స్థితిలో ఆంక్షల సడలింపు కోసం తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఢప్తి చేయడానికి, ఆంక్షల సడలింపు విధివిధానాలు ఎలా ఉండాలనే విషయంపై చిరంజీవి నివాసంలో సమావేశాలు జరుగుతూ వస్తున్నాయి. 

తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కూడా సమావేశాల్లో పాల్గొన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ తో చర్చల తర్వాత చిరంజీవ, నాగార్జునల నేతృత్వంలో ప్రతినిధి బృందం తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ను కలిసింది. ఎన్టీఆర్ జయంరి రోజు బాలకృష్ణ ఆ సమావేశాలపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. భూములు పంచుకోవడానికి ఆ సమావేశాలు జరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. దానిపై నాగబాబు తీవ్రంగా ప్రతిస్పందించారు. 

Also Read: మెగా, నందమూరి హీరోల మధ్య నాగబాబు వ్యాఖ్యల చిచ్చు

click me!