'TENET' ట్రైలర్ 2: రివర్స్ టైమ్ తో ప్రపంచ యుద్ధాన్ని ఆపే ప్రయత్నం

By tirumala ANFirst Published May 22, 2020, 1:58 PM IST
Highlights

ఇటీవల ఎక్కువగా హాలీవుడ్ చిత్రాలు కూడా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రాణిస్తున్నాయి. అవెంజర్స్ సిరీస్ ఇండియాలో ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే.

ఇటీవల ఎక్కువగా హాలీవుడ్ చిత్రాలు కూడా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రాణిస్తున్నాయి. అవెంజర్స్ సిరీస్ ఇండియాలో ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. అవతార్ కూడా ఒక ఊపు ఊపింది. హాలీవుడ్ స్టార్స్, స్టార్ దర్శకుల చిత్రాలని చూసేందుకు ఇండియన్ సినీ అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. 

హాలీవుడ్ సినిమాలు ఎక్కువగా చూసే వారికి ప్రముఖ దర్శకుడు క్రిస్టఫర్ నోలెన్ గురించి పరిచయం అవసరం లేదు. టైం కాన్సెప్ట్ తో సినిమా చేయడం సాహసమే. కానీ నోలెన్ ఆ కాన్సెప్ట్ ని వెండితెరపై ఒక ఆట ఆడుకుంటున్నాడు.  నోలెన్ చిత్రాలని అర్థం చేసుకోవడం కష్టం. కానీ ఒకసారి నోలెన్ తెరకెక్కించిన సినిమా చూస్తే అతడికి అభిమానిగా మారిపోతారు. 

త్వరలో నోలెన్ నుంచి రాబోతున్న చిత్రం టెనెట్. ఇది కూడా టైం అనే కాన్సెప్ట్ ని ఆధారంగా చేసుకుని తెరకెక్కించిందే. దాదాపు ఏడు ప్రపంచ దేశాల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే ఒక ట్రైలర్ విడుదల కాగా తాజాగా మరో ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లో మరింత యాక్షన్ ని జోడించారు. 

ఈ చిత్రంలో జాన్ డేవిడ్ వాషింగ్టన్ ప్రధాన పాత్రలో నటించాడు. రాబర్ట్ ప్యాటిన్సన్ మరో కీలక పాత్రలో నటించాడు. బాలీవుడ్ నటి డింపుల్ కపాడియా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించడం విశేషం. 

ఈ చిత్రంలో జాన్ డేవిడ్ మూడవ ప్రపంచ యుద్దాన్ని ఆపేందుకు టెనెట్ అనే టైం రివర్స్ కాన్సెప్ట్ ఉపయోగించుకుని ప్రయత్నం చేస్తుంటాడు. ట్రైలర్ లో అనేక వింతలు విశేషాలు ఉన్నాయి. హీరో మరొకరితో పోరాటం చేస్తుండగా తుపాకీ రివర్స్ లో హీరో వద్దకు వస్తుంది. భారీ ఓడలు, చివర్లో విమానం క్రాష్ కావడం లాంటి సన్నివేశాలు ఆసక్తిని పెంచుతున్నాయి. జులైలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. 

 

click me!