నాగశౌర్యపై టాక్సీ డ్రైవర్ల ఫిర్యాదు.. ఏం జరిగిందంటే!

By tirumala ANFirst Published Feb 7, 2020, 6:46 PM IST
Highlights

టాలీవుడ్ హీరో నాగశౌర్యపై టాక్సీ డ్రైవర్ల జేఏసీ హ్యూమన్ రైట్స్ కమిషన్ లో ఫిర్యాదు చేశారు. నాగశౌర్య రీసెంట్ గా నటించిన చిత్రం అశ్వథ్థామ. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయం దిశగా దూసుకుపోతోంది. వసూళ్లు కూడా బాగానే వస్తున్నాయి. 

టాలీవుడ్ హీరో నాగశౌర్యపై టాక్సీ డ్రైవర్ల జేఏసీ హ్యూమన్ రైట్స్ కమిషన్ లో ఫిర్యాదు చేశారు. నాగశౌర్య రీసెంట్ గా నటించిన చిత్రం అశ్వథ్థామ. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయం దిశగా దూసుకుపోతోంది. వసూళ్లు కూడా బాగానే వస్తున్నాయి. 

అమ్మాయిల కిడ్నాప్, హత్యల లాంటి క్రైమ్ అంశాలు, చెల్లెలి సెంటిమెంట్ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇటీవల సమాజంలో కూడా ఈ ఇలాంటి ఘటనలు జరిగాయని.. ఆ సంఘటనల ఆధారంగానే ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు నాగశౌర్య ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. 

గనుల్లో హీరో విజయ్ 'మాస్టర్' షూటింగ్.. దాడికి బీజేపీ ప్రయత్నం!

ఓ ఇంటర్వ్యూలో నాగశౌర్య డ్రైవర్లని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. చదువు లేని వ్యక్తులే ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారని శౌర్య చెప్పుకొచ్చాడు. చదువుకుంటే స్కూల్ లో చిన్న తప్పు చేసినా ఉపాధ్యాయులు దండించడమో, మందలించడంమో, సరైన మార్గంలో నడిపించడమో చేస్తారు. కానీ చదువులేని వ్యక్తి ఏదైనా చేస్తే ఇది తప్పు అని చెప్పేవాళ్ళు ఉండరు. 

RRR '*' లేకుండా ఇండస్ట్రీ హిట్.. నెటిజన్ కు బాహుబలి నిర్మాత రిప్లై!

డ్రైవర్లలో చాలా మంది చదువులేని వాళ్ళు ఉంటారు. అందుకే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని నాగశౌర్య అభిప్రాయపడ్డాడు. ఈ వ్యాఖ్యలే టాక్సీ డ్రైవర్ల మనోభావాలు కించపరిచేలా చేశాయి. డ్రైవర్లని అవమానించేలా నాగశౌర్య కామెంట్స్ చేశాడని టాక్సీ డ్రైవర్ల జేఏసీ హెచ్ ఆర్సీలో ఫిర్యాదు చేశారు. దీనిపై నాగశౌర్య స్పందించాల్సి ఉంది. 

click me!