ఇళయదళపతి విజయ్ ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శత్వంలో మాస్టర్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. గత ఏడాది బిగిల్ లాంటి సూపర్ హిట్ సొంతం చేసుకున్న తర్వాత విజయ్ నటిస్తున్న చిత్రం ఇది. ఇదిలా ఉండగా కొన్ని రోజుల క్రితం విజయ్ మాస్టర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండగా ఐటి అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే.

అధికారులు కొన్ని గంటలపాటు విజయ్ ని ఆదాయపు పన్ను వివరాలపై ప్రశ్నించారు. అతడి నివాసంలో దాదాపు 67 కోట్ల సొమ్ము స్వాధీనం చేసుకునట్లు కూడా వార్తలు వచ్చాయి. దీనితో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విజయ్ పై కక్ష పూరితంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వినిపించాయి. విజయ్ తన మెర్సల్, సర్కార్ లాంటి చిత్రాల్లో పొలిటికల్ సెటైర్స్ సంధించడం వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే.
undefined
విజయ్ పై ఐటీ దాడుల వ్యవాహారం తమిళనాడులో హాట్ టాపిక్ గా మారింది. విజయ్ అభిమానులు నేరుగా బిజెపిపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా మరో సంఘటన చోటు చేసుకుంది. ఐటీ రైడ్స్ తర్వాత తమిళనాడులో విజయ్ వెర్సస్ బిజెపి అన్నట్లుగా పరిస్థితి మారింది. తాజాగా బిజెపి కార్యకర్తలు విజయ్ నటిస్తున్న మాస్టర్ చిత్ర లొకేషన్ లో అటాక్ కు ప్రయత్నించారు.
చిరునవ్వుతో చంపేస్తున్న అనుపమ.. ఆకట్టుకుంటోన్న గ్లామర్ పిక్స్
ఐటీ రైడ్స్ తర్వాత యథావిధిగా విజయ్ షూటింగ్ కు హాజరవుతున్నాడు. తమిళనాడులోని నైవేలీ ప్రాంతంలో గనుల్లో విజయ్ షూటింగ్ జరుగుతోంది. అక్కడకు వెళ్లిన బిజెపి కార్యకర్తలు షూటింగ్ ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. గనుల్లో షూటింగ్ కు ఎలా అనుమతి ఇస్తారని ప్రశ్నించారు. బిజెపి కార్యకర్తల రాకతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. దీనితో షూటింగ్ లోకేష్ వద్ద భారీగా పోలీసులు బందోబస్త్ ఏర్పాటు చేశారు.