సౌత్ లో హీరోల అభిమానుల మధ్య ఫ్యాన్ వార్స్ జరుగుతున్నాయంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఇళయదళపతి విజయ్, తలా అజిత్ అభిమానులే. చీటికీ మాటికీ ఈ ఇద్దరు హీరోల అభిమానులు సోషల్ మీడియాలో, బయట గొడవ పడడం చూస్తూనే ఉన్నాం.
సౌత్ లో హీరోల అభిమానుల మధ్య ఫ్యాన్ వార్స్ జరుగుతున్నాయంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఇళయదళపతి విజయ్, తలా అజిత్ అభిమానులే. చీటికీ మాటికీ ఈ ఇద్దరు హీరోల అభిమానులు సోషల్ మీడియాలో, బయట గొడవ పడడం చూస్తూనే ఉన్నాం. ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ పైత్యం ఎంతవరకు వెళ్లిందంటే.. అజిత్, విజయ్ మరణించినట్లు ఫేక్ ప్రచారం చేసుకునే వరకు వెళ్ళింది.
రూ.75 కోట్లు ఆఫర్ చేసిన దిల్ రాజు.. ఎవరికో తెలుసా?
undefined
కానీ తాజాగా విజయ్ కి మద్దతుగా గతంలో అజిత్ చేసిన వ్యాఖ్యలని ఇరు హీరోల ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళదాం.. ప్రస్తుతం విజయ్ లోకేష్ కనకరాజ్ దర్శత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ లో విజయ్ బిజీగా ఉండగాఊహించని విధంగా ఐటి అధికారులు దాడులు జరిపారు. విజయ్ కడలూరులోని నెయ్యేలి ప్రాంతంలో షూటింగ్ లో ఉండగా ఐటి రైడ్స్ జరిగాయి.
విజయ్ ని కొన్ని గంటలపాటు ఐటీ అధికారులు ప్రశ్నించారు. విజయ్ నివాసం నుంచి దాదాపు రూ 67 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. విజయ్ పై రాజకీయ కక్షతో ఐటి దాడులు జరిపిస్తున్నారని ఆయన అభిమానులు అంటున్నారు.
ఎన్టీఆర్ తో కుదరదు.. ఆశలన్నీ అతడిపైనే..
ఇదిలా ఉండగా గతంలో అజిత్ ఐటి దాడుల గురించి చేసిన వ్యాఖ్యలకు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి. పన్ను రేట్లు, టాక్సుల శాతం పెంచడం.. ఆపై సెలెబ్రిటీలపై రైడ్స్ పేరుతో విరుచుకుపడడం.. ఇలాంటి చర్యలు ఆపండి. ప్రజల సొమ్ముని సినిమా సెలెబ్రిటీలు దోచుకోవడం లేదు. డబ్బంతా అవినీతిపరులైన రాజకీయ నాయకుల వద్దే ఉంది. ఒక సారి అవినీతిపరులైన రాజకీయ నాయకులందరిపై రైడ్స్ చేయండి. ఈ దేశంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి అని అజిత్ గతంలో ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.