
మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ భామ సుస్మితా సేన్ తరచుగా వార్తల్లో నిలుస్తోంది. 46 ఏళ్ళు వచ్చినా ఆమె వివాహం చేసుకోలేదు. ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకుని జీవితం సాగిస్తున్నారు. సుస్మితా సేన్ లైఫ్ లో పెళ్లి లేదు కానీ.. ప్రేమ, రిలేషన్ షిప్ వ్యవహారాలు చాలానే ఉన్నాయి. రీసెంట్ గా సుస్మితా సేన్ తన యంగ్ పార్ట్నర్, ప్రియుడు రొహ్మన్ నుంచి విడిపోయింది.
ఆ సంగతి మరిచిపోక ముందే లలిత్ మోడీతో రిలేషన్ షిప్ షురూ చేసింది. వీరిద్దరూ తమ రిలేషన్ ని అఫీషియల్ గా ప్రకరించారు కూడా. సుస్మితా, లలిత్ మోడీ సన్నిహితంగా ఉన్న ఫిక్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. సుస్మితా సేన్ తో విడిపోయినప్పుడు.. ఆమె లలిత్ మోడీతో రిలేషన్ ప్రకటించినప్పుడు.. రొహ్మన్ స్పందించాడు.
తనకు ఎలాంటి బాధ లేదని.. ఎవరి జీవితం వాళ్ళ ఇష్టం అంటూ వేదాంత ధోరణిలో స్టేట్మెంట్ ఇచ్చాడు. సుస్మితా సేన్ ని ట్రోల్ చేయకుండా ఆమెని సంతోషంగా ఉండనివ్వండి అంటూ నెటిజన్లకు సూచించాడు. తన మాజీ ప్రేయసిని సంతోషంగా ఉండనివ్వండి అని పేర్కొన్నాడు.
రొహ్మన్ పరిస్థితి చూస్తుంటే అతడు సుస్మితా సేన్ ని మరచిపోలేకున్నాడా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. సుస్మితా సేన్ వయసు 46 ఏళ్ళు. రొహ్మన్ వయసు 30 ఏళ్ళు. అంటే అతడు ఆమెకన్నా 16 ఏళ్ళు చిన్నవాడు. సుస్మితా సేన్ తో డీప్ లవ్ లో మునిగిపోయిన రొహ్మన్.. ప్రస్తుతం బ్రేకప్ కావడంతో కుంగిపోయినట్లు కనిపిస్తున్నాడు.
పైకి ధైర్యంగా ఉన్నట్లు కనిపిస్తున్నాడు కానీ తరచుగా ఆమెనే గుర్తు చేసుకుంటున్నాడు. తాజాగా సోషల్ మీడియాలో రోహ్మ్యాన్ ఎమోషనల్ గా ఓ వీడియో పోస్ట్ చేశాడు. రోహ్మ్యాన్ మాట్లాడుతుంటే అతడి కళ్ళలో నీళ్లు కూడా తిరిగాయి. మీ పార్ట్నర్ మీద మీరు ఎందుకు డిపెండ్ అవ్వాలి ? ఎవరి లైఫ్ వాళ్ళది.. మీ పార్ట్నర్ కి కూడా సొంత ఆలోచనలు.. సొంత పనులు ఉంటాయి. ఎవరో మిమ్మల్ని కంప్లీట్ మనిషిగా మార్చలేరు.. మీకు మీరే కంప్లీట్ అవ్వాలి అంటూ పరోక్షంగా సుస్మితా సేన్ ఎమోటినల్ కామెంట్స్ చేశాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.