
నిఖిల్ (Nikhil Siddharth) హీరోగా తెరకెక్కిన మిస్టరీ థ్రిల్లర్ చిత్రం ‘కార్తికేయ 2’ (Karthikeya 2). సూపర్ హిట్ ‘కార్తికేయ’ సినిమాకు సీక్వెల్ ఇది. ఈ చిత్రం ఈ నెల 22న విడుదలకావాల్సి ఉండగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. కొత్త విడుదల తేదీని చిత్ర టీమ్ తాజాగా ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో ఈ సినిమాని ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు తెలిపింది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోయిన్ . శ్రీకృష్ణుడి తత్వం, ద్వారకా నగరం నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ కు థియేటర్స్ పరంగా ఇబ్బందులు వచ్చే అవకాసం ఉందని తెలుస్తోంది.
అందుకు కారణం అదే రోజు నితిన్ సినిమా ‘మాచర్ల నియోజకవర్గం’ విడుదల వుంది. నైజాంలో దిల్ రాజు పంపిణీ చేస్తున్నారు. మరో ప్రక్క ఆగస్ట్ 5న కళ్యాణ్ రామ్ బింబిసార వుంది. ఆ సినిమా కూడా దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. దాంతో ఖచ్చితంగా థియేటర్స్ విషయంలో ఇబ్బందులు వస్తాయంటున్నారు. ఎందుకంటే బింబిసార సూపర్ హిట్ అయితే ఆ థియేటర్స్ తీయటానికి ఉండదు. నితిన్ మాచర్ల కు ఎక్కువ థియేటర్స్ కేటాయించాలి. కాబట్టి చాలా భాగంగా థియేటర్స్ దిల్ రాజు రిలీజ్ ల వైపై ఉండిపోతాయి. ప్రైమ్ థియేటర్స్ నిఖిల్ సినిమాకు దొరకటం కష్టమైపోతుందంటోంది ట్రేడ్.
ఇక కార్తికేయ 2 కు మంచి బజ్, క్రేజ్ ఉంది. తొలిభాగం సూపర్‌హిట్ కావడంతో ఈ సీక్వెల్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్,పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ లభించింది. ఏ మాత్రం టాక్ బాగున్నా ఈ సీక్వెల్ తో నిఖిల్ హిట్ కొట్టడం ఖాయం. పైగా అనుపమ క్రేజ్ కూడా ఈ సినిమాకు ప్లస్ పాయింట్ కానుంది. అలాగే ఇస్కాన్ అత్యున్నత సంస్థానం ఉత్తర్‌ప్రదేశ్‌లోని ‘బృందావన్’ సందర్శించాలంటూ ఆహ్వానం అందగా చిత్ర టీమ్ కు మంగళవారం సందర్శించింది. భారతీయ సినీ చరిత్రలోనే ఇది ఎవరికీ దక్కని అరుదైన గౌరవం అని సినీవర్గాలు పేర్కొన్నాయి.