రెండేళ్ల క్రితం శ్రీదేవి మరణ వార్త ఆమె అభిమానులకు షాక్ కు గురి చేసిన సంగతి తెలిసిందే. తన బంధువుల వివాహం కోసం దుబాయ్ వెళ్లిన ఆమె.. ఓ హోటల్ బాత్‌రూమ్ టబ్‌లో ప్రమాదవశాత్తు పడి కన్నుమూసారు.
రెండేళ్ల క్రితం శ్రీదేవి మరణ వార్త ఆమె అభిమానులకు షాక్ కు గురి చేసిన సంగతి తెలిసిందే. తన బంధువుల వివాహం కోసం దుబాయ్ వెళ్లిన ఆమె.. ఓ హోటల్ బాత్‌రూమ్ టబ్‌లో ప్రమాదవశాత్తు పడి కన్నుమూసారు. అయితే అప్పట్లో ఆమె మరణంపై రకరకాల అనుమానాలు తలెత్తాయి. అయితే తాజాగా శ్రీదేవి మరణంపై ప్రముఖ రచయత సత్యర్ధి నాయక్ షాకింగ్ న్యూస్‌ను బయటపెట్టాడు. శ్రీదేవి జీవితంపై బయోగ్రఫీ పుస్తకం రాసిన ఆయన.. అందులో శ్రీదేవి మరణానికి గల అసలు కారణాలు ఏంటో చెప్పి షాక్ ఇచ్చారు. దీనికి సంబంధించి ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
ఆయన మాట్లాడుతూ...శ్రీదేవికి తొలి నుంచి లో బీపీ ఉండేదని.. అప్పుడప్పుడు షూటింగ్ స్పాట్‌లో కూడా కళ్లు తిరిగిపడిపోయేదన్న విషయాన్ని తెలిపాడు. ఇలా అనేక సార్లు పడిందని… శ్రీదేవితో ‘చాల్‌బాజ్’ చిత్రాన్ని తెరకెక్కించిన పంకజ్ పరాషర్ చెప్పినట్లు సత్యార్ధి వెల్లడించాడు.
అంతేకాదు.. హీరో నాగార్జునతో ఓ చిత్ర షూటింగ్ జరిగేటపుడు కూడా ఓసారి బాత్రూమ్‌లో పడిపోయిన సందర్భాన్ని తనతో ప్రస్తావించినట్టు నాయక్ పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. శ్రీదేవి బంధువు.. మహేశ్వరి, భర్త బోనీ కపూర్ కూడా శ్రీదేవి ఒక్కోసారి వాకింగ్ చేసేటపుడు స్పృహకోల్పోయి కిందపడ్డ సందర్భాలున్నాయన్నారు.
అయితే ఆమెకు “లో బీపీ” ఉన్న విషయాన్ని వైద్యులకు చూపించినా ఉపయోగం లేకుండాపోయిందన్న విషయం కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో అసలు శ్రీదేవి మరణానికి “లో బీపీ”నే కారణమన్న విషయాన్ని ఈ సంఘటనలు తేల్చేస్తున్నాయని అంటున్నారీ రచయిత.
ఇక శ్రీదేవి మృతికి సంబంధించిన ఫోరెన్సిక్ నివేదికలో అంశాలను అప్పట్లో యూఏఈ ఆరోగ్య శాఖ విడుదల చేసింది. ఆమె ప్రమాదవశాత్తు బాత్ రూమ్‌లోని టబ్‌లో పడి చనిపోయినట్లు తమ వైద్యులు నిర్ధారించారని చెప్పారు. ఆ సమయంలో ఆమె మద్యం తీసుకుని వున్నారని, దాంతో పట్టు తప్పి నీళ్లలో పడిపోయారని, నీటి టబ్బులో నుంచి బయటకు తీసే సమయానికే శరీరం కొంత ఉబ్బిపోయి ఉన్నటు ఫోరెన్సిక్ నివేదికలో పేర్కొన్నారు. ఈ మేరకు దుబాయ్ పోలీసులు శ్రీదేవి కుటుంబ సభ్యులకు శవ పరీక్ష నివేదికను అప్పగించారు.
పోర్న్ చిత్రాల నటికి రూ.90 కోట్లు.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన కోర్టు!
undefined
పోలీసులు ఇచ్చిన నివేదిక ప్రకారం శనివారం సాయంత్రం పార్టీ నుంచి హోటల్‌లో గదికి వెళ్లిన శ్రీదేవి 7గంటల ప్రాంతంలో బాత్‌రూమ్‌కు వెళ్లారు.అందులోనే అనుకోకుండా కాలు జారీ నీళ్ల టబ్‌లో పడిపోయారు. ఆ సమయంలోనే ఆమె తీవ్ర కంగారుకు లోనై గుండెపోటు వచ్చి టబ్‌లో నుంచి పైకి లేవలేక, ఊపిరి ఆడక ఆమె తుది శ్వాస విడిచారు.
ప్రభుత్వానికి చిరంజీవి డిమాండ్.. మహేష్ మనసు దోచుకున్న మెగాస్టార్!
అయితే, ఈ ఘటన జరిగిన కొద్ది సేపటికే ఆమె భర్త బోనీ కపూర్ హౌటల్ గదికి వచ్చారు. ఎంత కొట్టి చూసినా శ్రీదేవి బాత్ రూం తలుపులు తీయకపోవడంతో హోటల్ సిబ్బంది సాయంతో తలుపులు బద్ధలు కొట్టి లోపలికి వెళ్లారు. అపస్మారక స్థితిలో ఉన్న శ్రీదేవిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.