డబ్బు కోసమే ఇండస్ట్రీకి వచ్చా.. సోనాలి బింద్రే కామెంట్స్!

By AN TeluguFirst Published Jan 25, 2020, 4:44 PM IST
Highlights

టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ చిత్రాల్లో కూడా నటిస్తూ బిజీగా గడిపిన ఈ భామ తాజాగా మీడియాతో ముచ్చటించింది. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను ఆమె పంచుకున్నారు. 

దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించిన ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పిన నటి సోనాలి బింద్రే తనకంటూ ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ చిత్రాల్లో కూడా నటిస్తూ బిజీగా గడిపిన ఈ భామ తాజాగా మీడియాతో ముచ్చటించింది.

తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను ఆమె పంచుకున్నారు. డబ్బులు సంపాదించడం కోసమే తాను సినిమాల్లోకి వచ్చానని.. సినిమాల్లోకి అడుగుపెట్టిన తరువాత ఈ వృత్తి ఎంతగానో నచ్చిందని.. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా సినిమా పరిశ్రమ చాలా అధ్బుతమైన ప్రదేశమని అన్నారు.

అమెజాన్ ప్రైమ్ కి పోటీగా అల్లు అరవింద్, కొత్త యాప్ వచ్చేసింది!

ఈ పరిశ్రమలోనే కుటుంబ సభ్యులతో పాటు ఎందరో స్నేహితులను సొంతం చేసుకున్నానని అన్నారు. బాలీవుడ్ కి ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పారు. మధ్య తరగతి కుటుంబానికి చెందిన తను సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడమనేది.. తనకు జరిగిన ఓ అధ్బుతమని.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు.. కొత్త లోకంలోకి వచ్చినట్లు అనిపించిందని పేర్కొన్నారు.

సోనాలికి పుస్తకాలంటే చాలా ఇష్టమని.. చిన్నప్పటి నుండి పుస్తకాలు తనకు మంచి స్నేహితులను ఆమె తెలిపారు. క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ఫారెన్ కి వెళ్లినప్పుడు పుస్తకాలకు మరింత దగ్గరయ్యానని చెప్పారు. ఆ సమయంలో చదివిన 'ఏ జెంటిల్మేన్ ఇన్ మాస్కో' అనే సినిమా తనలో ధైర్యం నింపిందని చెప్పారు.  

click me!