RRR:పులితో ఎన్టీఆర్ ఫైట్ లీక్.. రాజమౌళికి షాక్..!

Published : Jan 25, 2020, 04:05 PM IST
RRR:పులితో ఎన్టీఆర్ ఫైట్ లీక్.. రాజమౌళికి షాక్..!

సారాంశం

ఫేస్ బుక్, ట్విట్టర్ లో నుండి అయితే వీడియోను డిలీట్ చేయించారు కానీ వ్యక్తిగత మొబైల్స్ లోకి చేరిన వీడియోలను డిలీట్ చేయించడం ఎవరి వల్ల కాదు. ప్రస్తుతం ఈ వీడియో వాట్సాప్ లో వైరల్ అవుతోంది. గ్రూపుల్లో తెగ షేర్ అవుతోంది.

దర్శకదీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తోన్న 'RRR' సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రయూనిట్ కి ఊహించని దెబ్బ తగిలింది . ఈ సినిమా సంబంధించి ఎన్టీఆర్ పై తీసిన పులి ఫైట్ వీడియో లీక్ అయింది.

దీంతో యూనిట్ వెంటనే అప్రమత్తమైంది. కాపీరైట్స్ ఇష్యూ కింద సోషల్ మీడియాలో పెట్టిన వీడియోలను డిలీట్ చేసింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఫేస్ బుక్, ట్విట్టర్ లో నుండి అయితే వీడియోను డిలీట్ చేయించారు కానీ వ్యక్తిగత మొబైల్స్ లోకి చేరిన వీడియోలను డిలీట్ చేయించడం ఎవరి వల్ల కాదు.

'RRR'కి ఫైనాన్స్ ఎవరు చేస్తున్నారంటే..?

ప్రస్తుతం ఈ వీడియో వాట్సాప్ లో వైరల్ అవుతోంది. గ్రూపుల్లో తెగ షేర్ అవుతోంది. అలా విడుదలకు ముందే సినిమాలో అత్యంత కీలకమైన ఎన్టీఆర్-పులి ఫైట్ ని చాలామంది చూసేస్తున్నారు.

వీడియో లో కొమరం భీం పాత్రలో ఉన్న ఎన్టీఆర్ పరుగెడుతున్న స్టైల్ బాగుందంటూ సోషల్ మీడియాలో అంతా కామెంట్స్ పెడుతున్నారు. నిజానికి సినిమాలో ఇదే కీలకమైన ఫైట్ సీన్. బల్గేరియాలో ఈ సన్నివేశాలను చిత్రీకరించారు. రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి తెరకెక్కించారు.

సినిమా ప్రచారంలో కూడా ఈ ఫైట్ ని వాడకూడదని, కేవలం సినిమాలోనే ఉంచాలని భావించాడు రాజమౌళి. కానీ ఇప్పుడిలా ఫైట్ ముందే లీక్ అయిపొయింది. షూటింగ్ లో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ.. ఇలా వీడియోలు లీక్ అవుతూనే ఉన్నాయి. ఇకపై ఇలాంటి లీకులు కాకుండా మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నారు రాజమౌళి. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?