విజయ్ దేవరకొండతో దిల్ రాజు.. డైరెక్టర్ ఎవరంటే..?

Published : Nov 20, 2019, 10:37 AM IST
విజయ్ దేవరకొండతో దిల్ రాజు.. డైరెక్టర్ ఎవరంటే..?

సారాంశం

ప్రస్తుతం విజయ్ దేవరకొండ.. 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాని పూర్తి చేసుకున్నాడు. ఈ సినిమా తరువాత లైన్ లో పూరి జగన్నాథ్ ఉన్నాడు. ఆ తరువాత శివ నిర్వాణతో సినిమా ఉంటుందట. 

'నిన్ను కోరి', 'మజిలీ' వంటి హిట్ సినిమాలను రూపొందించిన దర్శకుడు శివ నిర్వాణ.. తన తదుపరి సినిమా నానితో లేదా విజయ్ దేవరకొండతో చేస్తాడనే వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు శివ నిర్వాణకి ఈ ఇద్దరు హీరోలను డైరెక్ట్ చేసే బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ముందుగా నాని హీరోగా సినిమా చేయనున్నాడని సమాచారం.

దీనికి సాహూ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఆ తరువాత విజయ్ దేవరకొండతో సినిమాకి సిద్ధమవుతారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ.. 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాని పూర్తి చేసుకున్నాడు. ఈ సినిమా తరువాత లైన్ లో పూరి జగన్నాథ్ ఉన్నాడు. ఆ తరువాత శివ నిర్వాణతో సినిమా ఉంటుందట. 

ఏఎన్నార్ నుంచి రాంచరణ్ వరకు.. టాలీవుడ్ అల్టిమేట్ రికార్డ్స్.. వీటిని టచ్ చేయడం అసాధ్యం

నిజానికి విజయ్ దేవరకొండ మైత్రి మూవీస్ వారు నిర్మిస్తోన్న 'హీరో'  సినిమాని పూర్తి చేయాలి. కానీ ప్రస్తుతానికి ఆ సినిమాని పక్కన పెట్టేస్తున్నట్లు తెలుస్తోంది. పూరి జగన్నాథ్ సినిమాని పూర్తి చేసిన తరువాత విజయ్ దేవరకొండ.. శివ నిర్వాణ సినిమాని మొదలుపెట్టనున్నాడు. వీరి కాంబినేషన్ లో సినిమాని దిల్ రాజు నిర్మించబోతున్నట్లు సమాచారం. 

చాలా రోజులుగా దిల్ రాజు, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో సినిమా రావాల్సివుంది. ఫైనల్ గా ఇప్పటికి ఆ ప్రాజెక్ట్ సెట్ అయినట్లు తెలుస్తోంది. శివ నిర్వాణ, విజయ్ దేవరకొండ, దిల్ రాజుల కాంబినేషన్ అంటే సినిమాపై అంచనాలు పెరిగిపోవడం ఖాయం. మరి సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటుందేమో చూడాలి!

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?