kamma rajyamlo kadapa reddlu:''మన పార్టీని ఆ పొట్టోడు లాగేసుకోకపోతే..'' ఎన్టీఆర్ ని ఉద్దేశించేనా..?

By AN TeluguFirst Published Nov 20, 2019, 10:17 AM IST
Highlights

ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించి విడుదల చేసిన పోస్టర్లు, ట్రైలర్, పాటలు ప్రతీది కూడా వివాదాస్పదంగా మారాయి. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మరో ట్రైలర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.  

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, సిద్ధార్ధ తాతోలు కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’.  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చోటుచేసుకున్న వివాదాస్పద అంశాల్ని ఉద్దేశించి ఈ సినిమాని రూపొందించారు.

ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించి విడుదల చేసిన పోస్టర్లు, ట్రైలర్, పాటలు ప్రతీది కూడా వివాదాస్పదంగా మారాయి. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మరో ట్రైలర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.  ఏపీ సీఎం జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత విజయవాడ కేంద్రంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను ప్రధానంగా చేసుకొని ట్రైలర్ ని కట్ చేశారు.

యస్...బిడ్డకు జన్మనివ్వబోతున్నా .. డెలివ‌రీ డేట్ ఫిక్స్‌: సమంత

ముందుగా రామ్ గోపాల్ వర్మ వాయిస్ మొదలైన ఈ ట్రైలర్ లో కొన్ని ఆసక్తికర డైలాగ్స్ వినిపించాయి. ''ఇలాంటి వాతావరణంగా ఇంకో ఐదేళ్ళు కష్టమే.. అప్పటికి మీకు 75 సంవత్సరాలు వస్తాయి'' అని డైలాగ్ వినిపించగానే.. సినిమాలో మరో ముఖ్య పాత్రధారి.. ''ఈలోగా.. మన పార్టీని ఆ బుడ్డోడు లాగేసుకోకపోతే'' అని చెప్పడం వివాదాస్పదంగా మారింది. 

''కొడుకు మీద ప్రేమతో పార్టీని సర్వనాశనం చేశాడు'' అంటూ మరో డైలాగ్స్.. పవన్ కళ్యాణ్ స్పీచ్ లు, కేఏ పాల్ కామెడీ, లోకేష్ తెలివితక్కువతనం ఇలా ట్రైలర్ లో ఏ ఒక్క అంశాన్ని  వదలకుండా ఆడేసుకున్నాడు వర్మ. ఈ ట్రైలర్‌లో అలీ, బ్రహ్మానందం, యాంకర్ స్వప్న, కత్తి మహేష్‌లు కీలకపాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ నెల 29న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. 
 

click me!