Anchor Anasuya : మరో చిత్రానికి రెడీ అవుతున్న అనసూయ..

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 16, 2022, 01:42 PM ISTUpdated : Jan 16, 2022, 01:54 PM IST
Anchor Anasuya : మరో చిత్రానికి రెడీ అవుతున్న అనసూయ..

సారాంశం

స్మాల్ స్క్రీన్  సుందరి  యాంకర్ అనసూయ టీవీషోతో ఎంతో మందిని  ఆకట్టుకుంటుంది. ఆమె సొంత ఫ్యాన్ ఫాలోంగ్ పెంచుకోవడంతో వరుసగా సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. వచ్చిన అవకాశాన్ని అనసూయ సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నది. తానే ప్రధాన పాత్ర పోషిస్తూ ఓ సినిమా నిర్మితమవుతున్నట్టు సమాచారం.  

బుల్లి తెరను తన  అందంతో ఏలుతున్న అనసూయ, వరుస సినిమాలతో బిజీగా  ఉంటోంది. జబర్దస్త్ షోతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైన అను. తన మాటలతో, తన అందంతో ఎంతో మంది అభిమానులకు కూడగట్టుకొంది. తన అందానికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. జబర్దత్ షోను కామెడీ కోసం చూసే వాళ్లు ఉండటంతో పాటు, అనసూయ కోసం కూడా చూసే వాళ్లు ఉన్నారు.  అదే స్పీడ్ తో ఒక  సినిమా తర్వాత మరో సినిమాలో తనకు వచ్చిన పాత్రను పోషిస్తోంది. వెంటవెంటనే సినిమాల్లో అభిమానులకు కనిపిస్తూ అలరిస్తున్న అనసూయ తన వచ్చే సినిమాలో లీడ్ రోల్ చేయనున్నారు. ప్రధాన పాత్రలో అనసూయ  త్వరలోనే మరో సినిమాలో కనిపించనున్నారు.

కాగా పేపర్ బాయ్, విటమిన్-షి సినిమాలకు దర్శకత్వం వహించి  తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచుకున్న యంగ్‌ డైరెక్టర్‌ జయశంకర్. ఈ సారి మరో ఢిపరెంట్‌ కాన్సెప్ట్‌ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఆర్వీ సినిమాస్‌ బ్యానర్‌పై  ఆర్వీ రెడ్డి, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి టైటిల్ ను కూడా ఖరారు చేసినట్టు సమచారం. తొలుత పలు టైటిళ్లను పరిశీలించినా ‘గ్రహమ్’అనే టైటిల్‌ను  ఖరారు చేసినట్లు సమాచారం. తర్వలోనే టైటిల్‌ని అధికారికంగా వెల్లడించనున్నారు. ఈ మూవీలోనే అనసూయ కీలక పాత్ర పోషించనున్నారు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానున్నట్టు సమాచారం. కాగా ఈ మూవీకి అనూప్ రూబెన్స్ సంగీతం అందించనున్నారు.  

ఇప్పటికే అనసూయ స్టార్ హీరోల చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది.  ఇటీవల రిలీజైన పుష్ప మూవీలో ‘దాక్షాయన’ పాత్రలో చక్కగా నటించింది. అందుకు అభిమానుల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు కూడా అందాయి. అలాగే అప్ కమింగ్ ఫిల్మ్స్ లోనూ కనిపించనున్నారు. మెగా స్టార్ చిరంజీవి, రామ్ చరణ్ నటిస్తున్న ‘ఆచార్య’ మూవీలోనూ అనసూయ కనిపించనున్నారు. అలాగే భీష్మ పర్వం, ఖిలాడి, పక్కా కమర్షియల్  వంటి సినిమాల్లోనూ తాను పలు రకాల పాత్రల పోషించింది. ఈ మూవీలు త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?