
దాదాపుగా పది రోజులుగా లతా మంగేష్కర్ ఐసీయూలోనే చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో డాక్టర్లు ఎప్పటికప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితిని పరీక్షిస్తున్నారు. దీంతో ఏం జరుగుతుందో తెలియక అభిమానులు ఆందోళనలో పడుతున్నారు. స్వర సరస్వతి, విఖ్యాత గాయని లతా మంగేష్కర్ ఆరోగ్యం ఇంకా కుదుట పడకపోడంతో సినీ ప్రముఖులను, అభిమానులను, బంధువులు చింతిస్తున్నారు.
అయితే ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న లతా మంగేష్కర్ ను పరీక్షిస్తున్నారు. ఈ మేరకు ఎప్పటికప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తున్నారు. రెండు, మూడు రోజుల నుంచి డాక్టర్లు ఆమె దగ్గరుండి ప్రత్యేక చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. అయినా ఇంకా మంగేష్కర్ ఆరోగ్యం కుదుట పడలేదట.
ఇంకొన్ని రోజులు చికిత్స అవసరమని, మరికొద్ది రోజులు ఐసీయూలో ఉంటేనే సాధారణ పరిస్థితికి వచ్చే అవకాశం ఉందంటున్నారు వైద్యులు. అయితే సింగర్ లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితిని బ్రీచ్ క్యాండీ ఆస్ప త్రి
డాక్టర్ ప్రతిట్ సందాని దగ్గరుండి ప్రత్యేకంగా పరీక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు కావాల్సిన మెడికల్ టెస్టులు చేస్తూ, కావాల్సిన చికిత్సను వెంటనే అందిస్తున్నారు.
తాజాగా, లతా మంగేష్కర్ ఆరోగ్యంపై డాక్టర్ ప్రతిట్ సందాని స్పందిస్తూ ఆమె ఇంకా ఐసీయూ వార్డులోనే చికిత్స పొందుతున్నారని తెలుపుతున్నారు. ఇంకా ఆమె ఆరోగ్య పరిస్థితిని పరీక్షిస్తున్నామని చెప్పారు. అప్పటికే లతా మంగేష్కర్ వయస్సు మీద పడటంతో మరికొద్ది రోజులు సమయం పడుతుందని సమచారం ఇచ్చారు.
జాయిన్ అయినప్పటి నుంచి ఆమెను ఐసీయూలోనే ఉంచి ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. మొదట ఆమె ఆరోగ్యం బాగానే ఉంది అని ఫ్యామిలీ మెంబర్స్ మీడియాకు చెప్పారు. అటు డాక్టర్స్ కూడా పరిస్థితి బాగానే ఉందన్నా ఇంకా కోలుకోకపోవడంతో ప్రస్తతం ఆందోళనకర పరిస్థితి నెలకొంది. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులంతా ఆకాంక్షిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ సింగర్ ఆశా భోంస్లే(Asha Bhosle) కూడా కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే.