రూ.5 కోట్లు ఎగవేత.. నటుడు ప్రకాష్ రాజ్ పై కేసు!

Published : Feb 28, 2020, 11:42 AM IST
రూ.5 కోట్లు ఎగవేత.. నటుడు ప్రకాష్ రాజ్ పై కేసు!

సారాంశం

తమిళంలో ధోని, ఉన్ సమయల్ అరైయిల్ వంటి చిత్రాలను సొంత దర్శకత్వంలో నిర్మించి నటించారు. కాగా ప్రకాష్ రాజ్ 'నడిగర్' అనే సినిమాని నిర్మించారు. 

నటుడు ప్రకాష్ రాజ్ కి మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రకాష్ రాజ్. నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా కూడా సినిమాలు చేశారు.

తమిళంలో ధోని, ఉన్ సమయల్ అరైయిల్ వంటి చిత్రాలను సొంత దర్శకత్వంలో నిర్మించి నటించారు. కాగా ప్రకాష్ రాజ్ 'నడిగర్' అనే సినిమాని నిర్మించారు. ఇది తమిళంలో రూపొందించిన 'ఉన్ సమయల్ అరైయిల్' సినిమాకి రీమేక్'.

ఎమోషనల్ గా వాడుకున్నాడు.. మాజీ బాయ్ ఫ్రెండ్ పై రష్మీ కామెంట్స్

అయితే ఈ సినిమాకి ఆయన బాలీవుడ్ ఫైనాన్షియర్ వద్ద రూ.5 కోట్లు అప్పుగా తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రకాష్ రాజ్ ఆ ఫైనాన్షియర్ కి చెక్కుని ఇవ్వగా.. అది బ్యాంక్ లో బౌన్స్ అయింది.

దీంతో ఆ ఫైనాన్షియర్ నటుడు ప్రకాష్ రాజ్ పై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను గురువారం నాడు విచారించిన న్యాయమూర్తి ఏప్రిల్ 2వ తేదీలోగా కోర్టుకి హాజరవ్వాలని నటుడు ప్రకాష్ రాజ్ కి సమన్లు జారీ చేశారు. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?