
సూపర్ స్టార్ మహేశ్‌బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 12న విడుదల కానుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, కళావతి సాంగ్స్ యూట్యూబ్‌ను షేక్ చేశాయి. ఇటీవల ఈ సినిమా నుంచి 'మ.. మ.. మహేశా' అనే పాట రిలీజ్ చేస్తే అదీ సూపర్ సక్సెస్ అయ్యిన విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రం అడ్వాన్స్ బుక్కింగ్ విషయానికి వస్తే ఓ రేంజిలో ఉన్నాయు. ముఖ్యంగా హైదరాబాద్ లో దుమ్ము దులుపుతోంది.
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం ప్రీ రిలీజ్ సేల్స్ హైదరాబాద్ సిటీలో 2.5 కోట్ల మార్క్ ని టచ్ చేసింది. ఇప్పటికే 2.51 కోట్లు గ్రాస్ దాటి పరుగెడుతోంది. మరో రెండు రోజుల్లో రిలీజ్ ఉందనగా ఈ అంకె మరిన్ని రెట్లు పెరగనుంది. ఓపినింగ్స్ మామూలుగా ఉండవంటున్నారు. ఇండియా మొత్తం మీద అడ్వాన్స్ సేల్స్ ఇప్పటి వరకూ ఐదున్నర కోట్లు దాటిందని తెలుస్తోంది.
మరో ప్రక్క సర్కార్ వారి పాటకు మద్దతుగా తెలంగాణ ప్రభుత్వం కొత్త జీవోను విడుదల చేసింది. టికెట్ ధరలను పెంచేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.30 నుండి 50 రూపాయల వరకు టికెట్ ధరల ను పెంచేందుకు అనుమతి ఇవ్వడం జరిగింది. 7 రోజుల పాటు సింగిల్ స్క్రీన్‌లు మరియు మల్టీప్లెక్స్‌లలో ఈ ధరలు ఇలా ఉండనున్నాయి. 7 రోజుల పాటు రోజుకు 5 షోలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ల ధర పెంపుకు అనుమతి ఇచ్చింది. భారీ బడ్జెట్ సినిమా కావడంతో 10 రోజుల పాటు సాధారణ టికెట్ల రేటుపై రూ.45 అదనంగా వసూళ్లు చేసుకునే వెసులుబాటుని కలిపిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పది రోజుల తర్వాత మళ్లీ పాత ధరలే కొనసాగుతాయి. టికెట్ల ధరను పెంచుకునే వెసులుబాటు కల్పించిన ఏపీ ప్రభుత్వానికి ‘సర్కారువారి పాట’ యూనిట్ కృతజ్ఞతలు తెలిపింది.
సూపర్ స్టార్ మహేశ్‌బాబు, కీర్తీ సురేష్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురాం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మించారు. మే 12న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కాబోతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు