
Avatar The Way Of Water Teaser Trailer Released: సినీ ప్రపంచం ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం అవతార్ 2. హాలీవుడ్ లెజండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ సృష్టించిన అద్బుత కళాఖండం 'అవతార్. ఈ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న చిత్రమే 'అవతార్: ది వే ఆఫ్ వాటర్. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత.. 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' ట్రైలర్ విడుదలైంది. అవతార్ మొదటి భాగం ప్రేక్షకులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇక ప్రస్తుతం విడుదలైన ట్రైలర్ చూస్తుంటే.. రెండో భాగం కూడా అవతార్ లవర్స్ ను వేరే లోకంలోకి తీసుకెళ్తుందనిపిస్తోంది. ట్రైలర్‌లో అద్భుతమైన దృశ్యాలు కనిపించాయి. ‘‘మనం ఎక్కడున్నా ఈ కుటుంబం మనల్ని కాపాడుతుందనే నమ్మకం నాకుంది..’’ అంటూ ట్రైలర్ చివర్లో వినిపిస్తోంది.
అవతార్ 2 ట్రైలర్ (Avatar 2 Teaser Trailer) నెట్టింట్లో సంచలనం సృష్టిస్తోంది. దాదాపు 1 నిమిషం 38 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్‌లో నీటి లోపల, వెలుపల అద్భుతమైన దృశ్యాలు చూపించబడ్డాయి. ఈ ట్రైలర్ చూశాక సినిమా చూడాలనే క్యూరియాసిటీ మరింత పెరగబోతోంది. ట్రైలర్‌ని హిందీ, ఇంగ్లీషు రెండు భాషల్లోనూ విడుదల చేశారు.
'అవతార్ 2' చిత్రం కథ గురించి అధికారిక సమాచారం వెల్లడి కాలేదు కానీ, పలు మూవీ లీక్స్ ప్రకారం, "అవతార్: ది వే ఆఫ్ వాటర్" చిత్రం జేక్ కుటుంబం (జేక్, నేయిత్రి, వారి పిల్లలు) కథను చెప్పడం ప్రారంభిస్తుంది. వారు మనుగడ కోసం పోరాడే పోరాటాలు, కుటుంబంగా వారు అనుభవించే విషాదాలు, ఒకరినొకరు సురక్షితంగా ఉంచుకోవడానికి వీటన్నింటికీ వారు ఎంత దూరం వెళతారనేది సోర్టీ.
జేమ్స్ కెమెరూన్ దర్శకత్వం వహించి జాన్ లాండౌ నిర్మించిన 'అవతార్ 2' ట్రైలర్ (Avatar 2 Teaser Trailer)తో పాటు, దాని విడుదల తేదీని కూడా వెల్లడించారు. 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' డిసెంబర్ 16, 2022న తెలుగు, కన్నడ మరియు మలయాళంలో సినిమాల్లో విడుదల కానుంది.