'సరిలేరు నీకెవ్వరు!' ప్రీమియర్ షో టాక్

By Prashanth MFirst Published Jan 11, 2020, 5:19 AM IST
Highlights

''సరిలేరు నీకెవ్వరు!' ప్రీమియర్ షో టాక్' సినిమాతో సిద్ధమైన మహేష్ నేటి నుంచి బాక్స్ ఆఫీస్ ఫైట్ ని మొదలుపెట్టబోతున్నాడు. అత్యధిక లొకేషన్స్ రిలీజ్ అవుతున్న ఈ కామెడీ అండ్ యాక్షన్ డ్రామాపై అభిమానుల్లో అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. సినిమాతో ఎలాగైనా మరో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవాలని సూపర్ స్టార్ రెడీగా ఉన్నాడు.

'సరిలేరు నీకెవ్వరు!' ప్రీసినిమాతో సిద్ధమైన మహేష్ నేటి నుంచి బాక్స్ ఆఫీస్ ఫైట్ ని మొదలుపెట్టబోతున్నాడు. అత్యధిక లొకేషన్స్ రిలీజ్ అవుతున్న ఈ కామెడీ అండ్ యాక్షన్ డ్రామాపై అభిమానుల్లో అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. సినిమాతో ఎలాగైనా మరో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవాలని సూపర్ స్టార్ రెడీగా ఉన్నాడు. ఇక యూఎస్ లో ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్ ముగిశాయి.

సినిమా ఫస్ట్ టాక్ ఎలా ఉందంటే.. గతంలో కొన్ని సినిమాల్లో తనలోని కామెడీ యాంగిల్ ని కాస్త రెగ్యులర్ గానే ఫాలో చూపించిన మహేష్ ఈ సారి మాత్రం మీటర్ ని మార్చేశాడు. సినిమాలో మరీ ఎక్కువ కాకుండా.. అలాగని మరీ తక్కువ కాకుండా తన మార్క్ డైలాగ్స్ తో ఆడియెన్స్ చేత విజిల్స్ వేయించాడు. మహేష్ కామెడీ ట్రాక్స్ తో సరిలేరు నికేవ్వరు అనిపించడాని చెప్పవచ్చు.

దర్శకుడు అనిల్ రావిపూడి మహేష్ పాత్రను డిజైన్ చేసిన విధానం బావుంది.   అయితే రష్మీక మందన్న మాత్రం కాస్త ఓవర్ గా చేసినట్లు టాక్ వస్తోంది. ఆమె పాత్రలో ఉండే అల్లరి కాస్త రొటీన్ గానే అనిపిస్తోంది. అలానే మరికొన్ని పాత్రలు కూడా మధ్యమధ్యలో కామెడీ ట్రాక్ లో ఫ్లోను మిస్ అయ్యేలా చేసినట్లు ఉంటుంది. అయితే కమర్షియల్ గా సినిమా సగటు ఆడియెన్స్ ని చాలా వరకు ఎంటర్టైన్ చేయగలదు. యాక్షన్ సీన్స్ లో కూడా దర్శకుడు తన మార్క్ ని చూపించాడు.

మహేష్ ఎంట్రీ తో పాటు క్లయిమ్యాక్స్ వరకు హీరో ఎలివేషన్ కి మంచి మార్కులు పడుతున్నాయి.   ఇక దేవిశ్రీప్రసాద్ సంగీతం కంటే.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు బాగా ఉపయోగపడింది. సూర్యుడివో..చంద్రుడివో.. సాంగ్ మేకింగ్ అండ్ లొకేషన్స్ ఒక మంచి ఫీల్ ని కలిగిస్తాయి. ఇక విజయశాంతి పాత్రను డిజైన్ చేసిన విధానం కూడా బావుంది.

ఎన్నో ఏళ్ల తరువాత మేకప్ వేసుకున్నప్పటికి ఆమె యాక్టింగ్ పవర్ ఏ మాత్రం తగ్గలేదు. లేడి అమితాబ్ అంటే ఏంటో మరోసారి నీరూపించారు. ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. ట్రైన్ ఎపిసోడ్ సీన్స్ కూడా బావున్నాయి. మొత్తంగా పండగ సమయంలో దర్శకుడు అనిల్ రావిపూడి మహేష్ తో మరో సక్సెస్ అందుకునేలా కనిపిస్తున్నాడు. మరీ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.

జూ.ఎన్టీఆర్ మూవీపై అల్లు అర్జున్ ప్రశంసలు.. ముఖ్యంగా ఆ సాంగ్!

click me!