మహేష్ బాబు మరో ఛాలెంజింగ్ రోల్.. అతడి దర్శకత్వంలో..

Published : Jan 10, 2020, 08:51 PM ISTUpdated : Jan 11, 2020, 11:07 AM IST
మహేష్ బాబు మరో ఛాలెంజింగ్ రోల్.. అతడి దర్శకత్వంలో..

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు. వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం మరొకొన్ని గంటల్లో రిలీజ్ కాబోతోంది. చిత్ర యూనిట్ మొత్తం ప్రేక్షకుల స్పందన కోసం ఎదురుచూస్తున్నారు. 

సరిలేరు నీకెవ్వరు ప్రచార కార్యక్రమాల్లో మహేష్ తన తదుపరి చిత్రాల గురించి వివరించాడు. సరిలేరు తర్వాత వంశీ పైడిపల్లి దర్శత్వంలో మరోసారి నటించబోతున్నట్లు ప్రకటించాడు. వంశీ, మహేష్ కాంబోలో మహర్షి చిత్రం వచ్చింది. ఈ చిత్రం మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. 

'సరిలేరు నీకెవ్వరు'.. బాలీవుడ్ క్రిటిక్ రివ్యూ.. ఒక్క మాటలో తేల్చేశాడు!

వంశీ, మహేష్ కాంబోలో రెండవసారి తెరకెక్కబోతున్న చిత్రం గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ చిత్రంలో మహేష్ బాబు 'డాన్' పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. బిజినెస్ మ్యాన్ చిత్రంలో మహేష్ ఈ తరహా పాత్రలో నటించాడు. కానీ అది పూర్తి స్థాయిలో ఒక డాన్ ని ప్రతిభింబించే పాత్ర కాదు. వంశీ పైడిపల్లి మహేష్ ని డాన్ గా ప్రజెంట్ చేసేందుకు అన్ని కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

మహర్షి చిత్రంలో మహేష్ బాబుని కార్పొరేట్ సంస్థ సీఈఓగా వంశీ అద్భుతంగా చూపించాడు. ఈ ఏడాది సమ్మర్ లో మహేష్, వంశీల చిత్రం పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?