గ్యాప్ రావొచ్చు కానీ.. అసత్య ప్రచారంపై సమంత!

By AN Telugu  |  First Published Feb 12, 2020, 3:35 PM IST

తమిళంలో 'సూపర్ డీలక్స్'లో కీలకపాత్ర పోషించింది సమంత. ఆ తరువాత మరో తమిళ సినిమా చేయలేదు. ఇటీవల ఆమె నటించిన 'జాను' సినిమా విడుదలై హిట్ టాక్ దక్కించుకుంది. 


పెళ్లి తరువాత సమంత అక్కినేని తన కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. కమర్షియల్ కథా చిత్రాలకంటే కథా బలమున్న చిత్రాల్లో నటించడానికే ఆసక్తి చూపుతున్నారు. అలానే నటనకు అవకాశం ఉన్న పాత్రలనే ఎంపిక చేసుకొని నటిస్తున్నారు.

అలా నటించిన 'ఓ బేబీ' సినిమా మంచి విజయాన్ని సాధించింది. తమిళంలో 'సూపర్ డీలక్స్'లో కీలకపాత్ర పోషించింది సమంత. ఆ తరువాత మరో తమిళ సినిమా చేయలేదు. ఇటీవల ఆమె నటించిన 'జాను' సినిమా విడుదలై హిట్ టాక్ దక్కించుకుంది. తమిళ '96' సినిమాకి రీమేక్ ఈ చిత్రం.

Latest Videos

undefined

మై గాడ్.. అచ్చు సమంత లాగే ఉంది.. ఎవరీ హాట్ బ్యూటీ

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సమంత మాట్లాడుతూ కొన్ని విషయాలకు క్లారిఫికేషన్ ఇచ్చింది. మరో రెండు మూడేళ్లలో సమంత నటనకి గుడ్ బై చెబుతానని అన్నట్లుగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనిపై స్పందించిన సమంత.. తాను మూడేళ్ల తరువాత సినిమాకి గుడ్ బై చెబుతానని అనలేదని చెప్పారు.

పదేళ్లకు పైగా నటిగా కొనసాగుతున్నానని.. సినిమా ప్రపంచం సవాల్ తో కూడుకున్నదని చెప్పారు. ఇక్కడ నటీమణులు ఎక్కువ కాలం కొనసాగడం కష్టమని చెప్పారు. అలా అవకాశాలు లేక తాను నటించలేకపోయినా.. ఏదో విధంగా సినిమాలోనే కొనసాగుతానని చెప్పారు.

నటనకు కొంచెం గ్యాప్ రావొచ్చు కానీ సినిమాకి దూరం అవుతానని ఎవరూ భావించాల్సిన అవసరం లేదంటూ.. తన గురించి వైరల్ అవుతోన్న అసత్య ప్రచారంపై సమంత క్లారిటీ ఇచ్చింది. 

click me!