KGF 2 అఫర్.. రిజెక్ట్ చేసిన బాహుబలి యాక్టర్

By Prashanth MFirst Published Feb 12, 2020, 2:43 PM IST
Highlights

ఈ చిత్రం కోసం సినీ ప్రేమికులు ఎంతగా ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక కన్నడ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది. ప్రస్తుతం సినిమాకు సంబందించిన షూటింగ్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. 

KGF 2.. ఈ చిత్రం కోసం సినీ ప్రేమికులు ఎంతగా ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక కన్నడ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది. ప్రస్తుతం సినిమాకు సంబందించిన షూటింగ్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. సమ్మర్ లో సినిమాను రిలీజ్ చేయాలనీ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.

అసలు మ్యాటర్ లోకి వస్తే. ఒక రూమర్ ఇంటర్నెట్ వరల్డ్ లో వైరల్ గా మారింది. KGF 2 సినిమాలో ఒక స్ట్రాంగ్ రోల్ కోసం రమ్యకృష్ణని సంప్రదించారట. అయితే అందుకు రమ్యకృష్ణ ఒప్పుకోలేదని తెలుస్తోంది. అందుకు పలు రకాల కారణాలు వినిపిస్తున్నటికి అసలు కారణం ఆమె ఎక్కువగా రెమ్యునరేషన్ డిమాండ్ చేయడమే అని తెలుస్తోంది.

బాహుబలి అనంతరం రమ్యకృష్ణ దాదాపు హీరోయిన్స్ లెవెల్లో రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం.  అందుకే ఎలాంటి ఆఫర్స్ వచ్చినా అదే రేంజ్ లో డబ్బులు డిమాండ్ చేస్తున్నారట. రమ్యకృష్ణ నో చెప్పగానే రవీనా తండోన్ ని సెలక్ట్ చేసుకున్నారు. మరీ ఆ పాత్ర తెరపై ఎలా ఉంటుందో చూడాలి.                    ఇక RRR సినిమా రిలీజ్ వాయిదా పడటంతో KGF 2 యూనిట్ ఉపిరిపీల్చుకున్నట్లు తెలుస్తోంది.

ఎందుకంటె ఈ బిగ్ సీక్వెల్ మే2 న రిలీజ్ చేయాలనీ అనుకున్నారు. కానీ RRR డేట్ ఎనౌన్స్ చేసిన తరువాత అందరికి ఆ విషయం ఆందోళన కలిగించింది.  కానీ ఇటీవల రాజమౌళి మరీంత సమయం కావాలని సినిమా రిలీజ్ తేదీని మార్చడంతో KGF యూనిట్ ఎగిరిగంతేసింది. ఎందుకంటె ఈ సినిమా కూడా దేశమంతా తెలుగు తమిళ్ కన్నడ మలయాళం హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.

RRR కూడా అన్ని భాషల్లో పోటీని ఇవ్వడం అనేది చాలా రిస్క్ తో కూడుకున్న పని.  చిన్న సినిమాకు కూడా పోటీ ఉండకూడదని KGF యాష్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇక RRR  లాంటి సినిమాతో పోటీ అంటే వెనుకడుగు వేయక తప్పదని అనుకున్నారు. కానీ రాజమౌళే ఆ బిగ్ మూవీ రిలీజ్ డేట్ మార్చడంతో యష్ టీమ్ హ్యాపీగా ఫీల్ అవుతోంది. అనుకున్నట్లుగానే ఇదే ఏడాది సమ్మర్ ఎండ్ లో కూల్ గా సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు.

click me!