చైతూపై సాయిపల్లవి డామినేషన్.. సమంతకు నచ్చలేదా ?

Published : May 04, 2020, 02:12 PM IST
చైతూపై సాయిపల్లవి డామినేషన్.. సమంతకు నచ్చలేదా ?

సారాంశం

అక్కినేని సమంత, నాగచైతన్య టాలీవుడ్ లో  సెలెబ్రిటీ కపుల్. 2018లో చైతు సమంత ప్రేమ వివాహంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ జంట అన్యోన్యంగా జీవనం సాగిస్తున్నారు.

అక్కినేని సమంత, నాగచైతన్య టాలీవుడ్ లో  సెలెబ్రిటీ కపుల్. 2018లో చైతు సమంత ప్రేమ వివాహంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ జంట అన్యోన్యంగా జీవనం సాగిస్తున్నారు. వివాహం తర్వాత కూడా సమంత సినిమాల్లో నటిస్తోంది. నాగ చైతన్య కూడా మంచి అవకాశాలు అందుకుంటున్నాడు. 

చైతు భార్యగా సమంత అతడికి కెరీర్ పరంగా సలహాలు ఇవ్వడం సహజమే. ప్రస్తుతం నాగ చైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో చైతు సరసన క్రేజీ హీరోయిన్ సాయి పల్లవి నటిస్తోంది. 

ఈ చిత్రాన్ని నారాయణ్ దాస్ నారంగ్, రామ్ మోహన్ రావులు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ 80 శాతం పూర్తయింది. మిగిలిన భాగాన్ని లాక్ డౌన్ తర్వాత పూర్తి చేయనున్నారు. ఈ చిత్రంపై సమంత స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు టాక్. 

ఇర్ఫాన్ ఖాన్ ఆస్తి ఎంతో తెలుసా.. దిమ్మ తిరిగే వివరాలు

ఇప్పటికే షూటింగ్ పూర్తయిన భాగాన్ని చైతు సమంతకు చూపించాడట. ఈ చిత్రంలో నాగ చైతన్య కంటే సాయి పల్లవి డామినేషన్ ఎక్కువగా ఉన్నట్లు సమంత గ్రహించిందట. ఇదే విషయాన్ని సమంత శేఖర్ కమ్ములకు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపుగా షూటింగ్ పూర్తయ్యాక ఇప్పుడు అసంతృప్తి వ్యక్తం చేస్తే ఏం ప్రయోజనం ఉంటుందని చిత్ర యూనిట్ సమంత గురించి చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?