
బాలీవుడ్ లో ఆన్ స్క్రీన్ సూపర్ హిట్ జోడి అనిపించుకున్న రణవీర్ సింగ్, దీపికా పదుకొనేలు. ఆఫ్ స్క్రీన్ కూడా రొమాంటిక్ జోడిలుగా అనిపించుకున్నారు. కొంతకాలం ప్రేమ లోకంలో విహరించిన ఈ జంట తరువాత వివాహం చేసుకున్నారు. 2018 నవంబర్‌లో ఇటలీలో ఓ ప్రముఖ హోటల్‌లో ఇరు కుంటుంబాల పెద్దల సమక్షంలో కొంకిణీ సాంప్రదాయం ప్రకారం ఈ జంట వివాహం జరిగింది. పెళ్లి తరువాత కూడా తమ ఇంటిమేట్ ఫోటోలను అభిమానులకు షేర్ చేస్తూ అలరిస్తున్నారు ఈ జంట.
అదే సమయంలో వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. పెళ్లి ముందే కమిట్ అయిన అన్ని ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తూ వస్తున్నారు. అయితే తాజాగా కరోనా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ లు నిలిచిపోవటంతో ఈ ఇద్దరు స్టార్స్ ఇంటికే పరిమితమయ్యారు. ఈ సమయంలో హీరో రణవీర్ సింగ్ ఎక్కువగా నిద్రకే సమయం కేటాయిస్తుండగా, దీపిక మాత్రం తన భర్త కోసం రకరకాల వంటలు నేర్చుకొని మరి వండేస్తోంది. అందే కాదు తన పాకశాస్త్ర నైపుణ్యాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది.
అయితే తాజాగా దీపిక పోస్ట్ చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పచ్చి మామిడి కాయ ముక్కలపై ఉప్పు కారం చల్లిన ఫోటోను షేర్ చేసింది దీపిక. దీంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ అయ్యారు. దీపికా తల్లి కాబోతుందా..? అందుకే పులుపును ఇష్టపడుతుందా అని చర్చించుకుంటున్నారు అభిమానులు. అదే సమయంలో దీపిక తాను తల్లి కాబోతున్న విషయాన్ని ఇలా హింట్ ఇచ్చిందని చెపుతున్నారు నెటిజెన్లు. అయితే దీపిక మాత్రం ఈ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.