10 ఏళ్ళు పూర్తి.. సమంతకు 51.. చైతూకి 49 మాత్రమే..!

Published : Feb 26, 2020, 10:10 PM IST
10 ఏళ్ళు పూర్తి.. సమంతకు 51.. చైతూకి 49 మాత్రమే..!

సారాంశం

ఏ మాయ చేశావే చిత్రంతో నటిగా తన కెరీర్ ప్రారంభించింది. ఈ చిత్రంతోనే నాగ చైతన్య, సమంత మధ్య పరిచయం కూడా ఏర్పడింది. వీరిద్దరి కెరీర్ లో ఏ మాయ చేశావే చిత్రం మెమొరబుల్ హిట్ గా నిలిచిపోయింది.

ఏ మాయ చేశావే చిత్రంతో నటిగా తన కెరీర్ ప్రారంభించింది. ఈ చిత్రంతోనే నాగ చైతన్య, సమంత మధ్య పరిచయం కూడా ఏర్పడింది. వీరిద్దరి కెరీర్ లో ఏ మాయ చేశావే చిత్రం మెమొరబుల్ హిట్ గా నిలిచిపోయింది. ఈ చిత్రం విడుదలై నేటికి సరిగ్గా పదేళ్లు. అంటే సమంత సక్సెస్ ఫుల్ గా 10 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకుంది. 

ఈ సందర్భంగా సమంతకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. నాగ చైతన్యకు కూడా ఫస్ట్ బ్రేక్ లభించింది ఈ చిత్రంతోనే. ఈ రొమాంటిక్ మూవీతో ఏర్పడ్డ వీరిద్దరి పరిచయం ప్రేమగా మారడం.. ఆ తర్వాత వివాహబంధంతో ఒక్కటి కావడం చూశాం. 

సోషల్ మీడియాలో తనకు శుభాకాంక్షలు చెబుతున్న వారందరికీ సమంత కృతజ్ఞతలు చెబుతోంది. అలాగే ఈ పదేళ్ల కెరీర్ లో తన జ్ఞాపకాలని నెమరు వేసుకుంటోంది. తాజాగా తన కెరీర్ లోనే ఎప్పటికి గుర్తుండిపోయే అందమైన క్షణాలు ఇవే అంటూ తన అభిమానులు పోస్ట్ చేసిన వీడియో షేర్ చేసింది. 

Indian2:'ఆ క్రేన్ నా మీద పడున్నా బావుండేది'.. శంకర్ షాకింగ్ కామెంట్స్!

ఆ వీడియో మరేదో కాదు.. స్వయానా ది గ్రేట్ అక్కినేని నాగేశ్వరరావు గారు ఏ మాయ చేశావే చిత్రం విజయం సాధించిన సందర్భంగా చైతు, సమంతలని ప్రశంసిస్తున్న క్షణం అది. నా మనవడు అని స్వార్థ భావంతో కాకుండా చూస్తే.. ఈ చిత్రానికి గాను తాను సమంతకు 51 మార్కులు, నాగ చైతన్యకు 49 మార్కులు వేస్తానని ఏఎన్నార్ అన్నారు. 

ఏ మాయ చేశావే చిత్రం తర్వాత చైతు, సమంత.. ఆటోనగర్ సూర్య, మనం, మజిలీ లాంటి చిత్రాల్లో నటించారు. ఇక సమంత ఈ పదేళ్లలో టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా, స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. సమంత తన కెరీర్ లో ఎన్నో చిత్రాల్లో నటించింది. వాటిలో దూకుడు, అత్తారింటికి దారేది, ఈగ, మనం, జనతా గ్యారేజ్, అ..ఆ, మహానటి, రంగస్థలం చిత్రాలు ముఖ్యమైనవి. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?