‘సామజవరగమనా’ మలయాళ సాంగ్..అతన్ని మార్చటం బాగా ప్లసైంది.!

Published : Nov 10, 2019, 06:36 PM IST
‘సామజవరగమనా’ మలయాళ సాంగ్..అతన్ని మార్చటం బాగా ప్లసైంది.!

సారాంశం

నీ కాళ్లని పట్టుకు వదలనన్నవి చూడే నాకళ్లు.. అంటూ వచ్చే అలవైకుంఠపురంలో తొలి పాట తెలుగు వారి గుండెల్లోకి ఇట్టే దూసుకుపోయింది. ఇప్పుడు ఆ పాట మళయాళీలను అలరించటానికి సిద్దపడింది. 

నీ కాళ్లని పట్టుకు వదలనన్నవి చూడే నాకళ్లు.. అంటూ వచ్చే అలవైకుంఠపురంలో తొలి పాట తెలుగు వారి గుండెల్లోకి ఇట్టే దూసుకుపోయింది. ఇప్పుడు ఆ పాట మళయాళీలను అలరించటానికి సిద్దపడింది. 'అల వైకుంఠపురములో' చిత్రాన్ని  కేరళలో 'అంగు వైకుంఠపురతు' పేరుతో విడుదల చేస్తున్నారు. తాజాగా అక్కడి ప్రేక్షకుల కోసం సామజవరగన మలయాళ వెర్షన్ని విడుదల చేసింది చిత్రటీమ్. ఈ పాటకు అక్కడా ఓ రేంజిలో రెస్పాన్స్ వస్తోంది. ఆ పాటను మీరు ఇక్కడ వినవచ్చు.

మలయాళ వర్షన్ లో సామజవరగమనా సాంగ్ కోసం సింగర్ ని మార్చేశాడు సంగీత దర్శకులు థమన్. మలయాళ వర్షన్ ని ప్రముఖ గాయకుడు యేసుదాస్ కొడుకు విజయ్ యేసుదాస్ చే పాడించారు. ఇప్పటికే మూడు వందల పాటలకు పైగా పాడిన విజయ్ ఈ పాటను సైతం అద్భుతంగా పాడారు. తెలుగులో ఈ పాటను యంగ్ సెన్సేషన్ సిధ్ శ్రీరామ్ పాడారు.

ప్రస్తుతం అలవైకుంఠపురంలో టీమ్ సాంగ్స్ షూట్ కోసం ఫ్రాన్స్ వెళ్లారు. అక్కడ అందమైన లొకేషన్స్ లో హీరోహీరోయిన్స్ పై సాంగ్స్ తెరకెక్కిస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక మరియు హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టబు, సుశాంత్, నివేదా పేతురాజ్ ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది.

 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?