చిరు కుమార్తె శ్రీజ బర్త్ డే సెలెబ్రేషన్స్.. ఆటపట్టించిన రాంచరణ్!

Published : Nov 10, 2019, 05:37 PM IST
చిరు కుమార్తె శ్రీజ బర్త్ డే సెలెబ్రేషన్స్.. ఆటపట్టించిన రాంచరణ్!

సారాంశం

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ లో రాంచరణ్ అల్లూరి సీతా రామరాజు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

మెగాపవర్ స్టార్ రాంచరణ్ ఇంట్లో బర్త్ డే సెలెబ్రేషన్స్ జరిగాయి. రాంచరణ్ సోదరి శ్రీజ నేడు జన్మదిన వేడుకలు జరుపుకుంది. శ్రీజ బర్త్ డే సెలెబ్రేషన్స్ లో ఆమె భర్త కళ్యాణ్ దేవ్, రాంచరణ్, సుశ్మిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసే శ్రీజ బర్త్ డే ని సెలెబ్రేట్ చేశారు. 

ఈ వేడుకల్లో రాంచరణ్, శ్రీజ మధ్య చోటు చేసుకున్న సరదా ఘటన అభిమానులని ఆకట్టుకుంటోంది. శ్రీజకు కేక్ తినిపించడానికి ప్రయత్నించిన చరణ్ ఆమెని ఆటపట్టించాడు. కేక్ పూర్తిగా తినిపించకుండానే వచ్చిందా.. చాలు అంటూ ఆటపట్టించాడు. దీనితో పక్కనే ఉన్న సుస్మిత శ్రీజని చూసి నవ్వుకుంది. 

రాంచరణ్ ఈ వీడియోని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఈ వీడియోకు లక్షల్లో లైకులు లభిస్తున్నాయి. ఇక శ్రీజ బర్త్ డే సందర్భంగా ఆమె భర్త కళ్యాణ్ దేవ్ కూడా సోషల్ మీడియాలో స్పందించాడు. 

రాంచరణ్, శ్రీజ మధ్య జరిగిన సంఘటనపై స్పందిస్తూ.. మిమ్మల్ని అలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. హ్యాపీ బర్త్ డే శ్రీజ.. నీతో కలసి ఈ వేడుకల్ని జీవితాంతం జరుపుకుంటా.. ఈ బర్త్ డే చాలా స్పెషల్ అని కళ్యాణ్ దేవ్ కామెంట్ చేశాడు. 

 

 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?