'ప్రతిరోజూ పండగే' ప్రీరిలీజ్ బిజినెస్.. సాయిధరమ్ తేజ్ టార్గెట్ ఎంతంటే!

By tirumala ANFirst Published Dec 17, 2019, 8:41 PM IST
Highlights

సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ప్రతిరోజూ పండగే. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహించారు. మారుతి, సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న తొలి చిత్రం ఇది.

సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ప్రతిరోజూ పండగే. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహించారు. మారుతి, సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న తొలి చిత్రం ఇది. మొదటి నుంచే ఈ చిత్రంపై పాజిటివ్ బజ్ నెలకొని ఉంది. 

ట్రైలర్, పాటలు బయటికొచ్చాక ఆసక్తి మరింతగా పెరిగింది. తాత, మనవడి కథని మారుతి తనదైన శైలిలో వినోదం జోడించి రూపొందించారు. ఈ చిత్రంలో తేజుకి జోడిగా రాశి ఖన్నా నటించింది. డిసెంబర్ 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండడంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలు ప్రారంభించింది. 

అనసూయపై స్పైసీ కామెంట్.. ఫోటో బయట పెట్టిన డైరెక్టర్!

తాజాగా ఈ చిత్ర ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్ మంచి ధరకు అమ్ముడయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ16 కోట్ల వరకు ప్రతి రోజూ పండగే చిత్రానికి ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. ఓవర్సీస్ లో రూ1 కోటి.. కర్ణాటక, ఇండియాలోని ఇతర ప్రాంతాల్లో కోటి వరకు ప్రతిరోజూ పండగే చిత్ర ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. 

చిరంజీవి సినిమాకి ఫ్లాప్ టాక్.. ఇద్దరం ట్యాంక్ బండ్ దగ్గర ఏడ్చేశాం!

ఓవరాల్ గా ప్రపంచ వ్యాప్తంగా ప్రతిరోజూ పండగే థియేట్రికల్ హక్కులు 18 కోట్లకు అమ్ముడయ్యాయి. సాయిధరమ్ తేజ్ చిత్రానికి ఇది మంచి ధరే అని చెప్పొచ్చు.ఈ చిత్రం విజయం సాధించాలంటే 18 కోట్లకు పైబడి షేర్ రాబట్టాల్సి ఉంటుంది. ఇది తేజు గత చిత్రం చిత్రలహరి సాధించిన వసూళ్లకంటే కాస్త ఎక్కువే. చిత్రలహరి చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 15 కోట్ల షేర్ రాబట్టింది. హిట్ టాక్ వస్తే 18 కోట్లు రాబట్టడం పెద్ద విషయం కాకపోవచ్చు. ఇక నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో మరో 16 కోట్ల బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. 

click me!