అది నిజంగా రిషి కపూర్‌ లాస్ట్ వీడియోనేనా..!

Published : Apr 30, 2020, 05:12 PM ISTUpdated : Apr 30, 2020, 05:16 PM IST
అది నిజంగా రిషి కపూర్‌ లాస్ట్ వీడియోనేనా..!

సారాంశం

సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న రిషి కపుర్ లాస్ట్ వీడియో లేటెస్ట్ వీడియో కాదని తెలిపోయింది. అది రెండు నెలల క్రితం రిషి కపూర్‌ హాస్పిటల్‌కు రెగ్యులర్ చెకప్‌ కోసం వెళ్లిన సందర్భంలో ఈ వీడియో తీశారని తెలుస్తోంది.

బాలీవుడ్‌ లెజెండరీ యాక్టర్‌ రిషి కపూర్‌ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచాడు. అయితే ఈ నేపథ్యంలో సోషల్ మీడియా అంతా రిషి కపూర్‌ కు నివాళులతో మోత మోగిపోతోంది. అయితే ఈ నేపథ్యంలో ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. ఓ వ్యక్తి హాస్పిటల్‌ బెడ్‌ మీద ఉన్న రిషి కపూర్‌ను పరామర్శించి అతనితో కలిసి తీసుకున్న సెల్ఫీ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియో నిజంగానే ఆయన ఆఖరి వీడియోనేనా అన్న చర్చ కూడా జరుగుతోంది.

ఈ నేపథ్యంలో ఫ్యాక్ట్ చెక్ చేయగా ఆ వీడియో 2 నెలల క్రితం తీసిందని తేలింది. డీకే కుమార్‌ సాను అనే వ్యక్తి యూట్యూబ్‌ ఛానల్‌లో ఈ ఏడాది ఫిబ్రవరి 29న ఈ వీడియో అప్‌ లోడ్‌ చేశారు. అయితే ఆ వీడియోనే ఇప్పుడు ఆఖరి వీడియో అంటూ ట్రెండింగ్‌లోకి వచ్చింది. దీంతో అభిమానులు కూడా ఆ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. రిషి కపూర్‌ ఆసుపత్రిలో బుధవారం సాయంత్రం జాయిన్‌ అయ్యారు. అంటే సోషల్ మీడియాలో ట్రెండ్‌ అవుతున్న వీడియో లేటెస్ట్ వీడియో కాదని తేలిపోయింది.

విదేశాల్లో క్యాన్సర్‌ చికిత్స చేయించుకున్న తరువాత కొంత కాలం అక్కడే ఉన్న ఆయన ఇండియాకు వచ్చిన తరువాత రెగ్యులర్‌ చెకప్‌ కోసం తరుచూ హాస్పిటల్‌కు వెళుతున్నాడు. ఆ సమయంలోనే ఈ వీడియో తీసి ఉంటారన్న టాక్ వినిపిస్తోంది.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?