ఆ పాటల్లో ఎప్పుడూ బతికే ఉంటారు.. రిషి కపూర్‌ ఎవర్‌ గ్రీన్‌ సాంగ్స్‌

By Satish ReddyFirst Published Apr 30, 2020, 4:41 PM IST
Highlights

తొలి సినిమాతోనే మ్యూజికల్‌గా ఎవర్‌ గ్రీన్ హిట్స్ అందుకున్నాడు రిషి కపూర్‌. 1973లో రిలీజ్‌ అయిన బాబీ సినిమాకు లక్ష్మీ కాంత్ ప్యారేలాల్ అందించిన సంగీతం అప్పట్లో ఓ సెన్సేషన్‌. ఈ ఒక్క సినిమాతో యూత్‌ ఐకాన్‌ గా మారిపోయాడు రిషి కపూర్‌.

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మరో దిగ్గజ నటుడ్ని కోల్పోయింది. ఇండియన్‌ స్క్రీన్ మీద రొమాంటిక్‌ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఎదిగిన లెజెండరీ స్టార్ రిషి కపూర్‌ క్యాన్సర్‌తో సుదీర్ఘ పోరాటం తరువాత గురువారం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల యావత్ సినీ పరిశ్రమ సంతాపం వ్యక్తం చేస్తోంది. అయితే ఆయన మరణించిన ఎన్నో అద్భుత చిత్రాలు, పాత్రలు ఆయన్న ఎప్పటికీ గుర్తు చేస్తూనే ఉంటాయంటున్నారు ఫ్యాన్స్‌. ముఖ్యంగా సూపర్‌ హిట్ మెలోడీస్‌లో ఇండియన్‌ స్క్రీన్‌ను ఊపేసిన రిషి కపూర్‌ ఆ పాటల్లో ఎప్పటికీ బతికే ఉంటారంటున్నారు.

తొలి సినిమాతోనే మ్యూజికల్‌గా ఎవర్‌ గ్రీన్ హిట్స్ అందుకున్నాడు రిషి కపూర్‌. 1973లో రిలీజ్‌ అయిన బాబీ సినిమాకు లక్ష్మీ కాంత్ ప్యారేలాల్ అందించిన సంగీతం అప్పట్లో ఓ సెన్సేషన్‌. ఈ ఒక్క సినిమాతో యూత్‌ ఐకాన్‌ గా మారిపోయాడు రిషి కపూర్‌.

అంతేకాదు హీరో కాకముందు బాల నటుడిగా మేరే నామ్ జోకర్ సినిమాలో పరిచయం కావడానికి కన్నా ముందే రాజ్‌ కపూర్‌ హీరోగా తెరకెక్కిన శ్రీ 420 సినిమాలో ప్యార్‌ హువా.. ఇక్‌రార్‌ హువా అనే పాటలో కనిపించాడు. తరువాత కూడా సర్గం, అమర్‌ అక్బర్‌ ఆంటోని లాంటి సినిమాల్లో సూపర్‌ హిట్ పాటలు రిషిని వెతుక్కుంటూ వచ్చాయి. మహ్మద్ రఫీ, కిశోర్ కుమార్ లాంటి లెజెండరీ సింగర్స్ ఆలపించిన ఎన్నో సూపర్‌ హిట్‌ పాటల్లో కనిపించి అలరించాడు రిషి కపూర్‌.

ముఖ్యంగా బాబీ సినిమాలోని హమ్‌ తుమ్‌ ఏక్ కమరేమె బంద్‌ హో, సాగర్‌ సినిమాలోని సాగర్ కినారే, జానే దో నా లాంటి పాటలు ఎవర్‌ గ్రీన్‌ అన్న మాటలకు అసలు సిసలు నిదర్శనాలు. శ్రీదేవి, మాధురి దీక్షిత్‌, జూహి చావ్లా లాంటి గ్లామరస్‌ బ్యూటీస్‌తో రిషి కపూర్‌ డ్యూయట్స్‌ ఇండియన్‌ సినిమాకు సరికొత్త క్రేజ్‌ను తెచ్చిపెట్టాయి.


 

 

 

 

click me!