రిషి కపూర్ భార్య ఎమోషనల్ పోస్ట్.. కుటుంబ సభ్యుల విన్నపం

Published : Apr 30, 2020, 04:45 PM ISTUpdated : Apr 30, 2020, 04:50 PM IST
రిషి కపూర్ భార్య ఎమోషనల్ పోస్ట్.. కుటుంబ సభ్యుల విన్నపం

సారాంశం

బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషి కపూర్ నేటి ఉందయం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. రిషి కపూర్ గత రెండేళ్లుగా లుకేమియా క్యాన్సర్ తో బాధపడుతున్న సంగతి తెలిసిందే.

బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషి కపూర్ నేటి ఉందయం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. రిషి కపూర్ గత రెండేళ్లుగా లుకేమియా క్యాన్సర్ తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది యుఎస్ లో ట్రీట్మెంట్ తర్వాత రిషి కపూర్ ఆరోగ్యం కాస్త కుదుటపడింది. 

గత కొంతకాలంగా తిరిగి రిషి కపూర్ కు అనారోగ్య సమస్యలు మొదలయ్యాయి. బుధవారం రిషి కపూర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీనితో ముంబైలోని రిలయన్స్ పౌండేషన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రిషి కపూర్ మరణించారు. రిషి కపూర్ మరణంతో కపూర్ కుటుంబంతో పాటు అభిమానులంతా శోకంలో మునిగిపోయారు. 

తాజాగా రిషి కపూర్ కుటుంబం ఆయన మరణంపై అధికారిక ప్రకటన వెలువరించింది. ఆ ఎమోషనల్ ప్రకటనని రిషి కపూర్ సతీమణి నీతు కపూర్ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. 

రిషి కపూర్ ఈ ఉదయం 8:45 గంటలకు ప్రశాంతమైన మరణం పొందారు. ప్రపంచం మొత్తం ఆయనపై ప్రేమాభిమానాలు కురిపించింది. అలాగే రిషి కపూర్ కూడా అభిమానుల పట్ల కృతజ్ఞతతో ఉండేవారు. రిషి కపూర్ చివరి నిమిషం వరకు చిరునవ్వుతోనే జీవించారు. ఎప్పుడూ సంతోషంగా ఉండే వ్యక్తి. 

 

అలాంటి వ్యక్తికీ కన్నీటితో కాకుండా చిరునవ్వుతోనే వీడ్కోలు పలకాలి. అభిమానుల నుంచి ఆయన కోరుకున్నది కూడా అదే. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ నిబంధనల్ని అభిమానులు ఉల్లంగించవద్దు.. అంటూ కపూర్ కుటుంబం లేఖలో పేర్కొంది. 

రిషి కపూర్, నీతూ కపూర్ 1980లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి రణబీర్ కపూర్, రిథిమాకపూర్ సంతానం. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?