బోడి నా కొడుకు రాజమౌళిదే అంత ఉంటే...: వర్మ

Surya Prakash   | Asianet News
Published : Aug 09, 2021, 04:52 PM IST
బోడి నా కొడుకు రాజమౌళిదే అంత ఉంటే...: వర్మ

సారాంశం

వర్మ అంటేనే ఓ సెన్సేషన్. ఆయన మాటల్లో ఎప్పుడూ ఏదో ఒక వివాదం తొంగి చూస్తూంటుంది. తాజాగా ఒక సినిమా ఈవెంట్ లో కూడా ఎవరూ ఊహించని విధంగా కామెంట్ చేశారు. 

వర్మ అంటేనే ఓ సెన్సేషన్. ఆయన మాటల్లో ఎప్పుడూ ఏదో ఒక వివాదం తొంగి చూస్తూంటుంది. తాజాగా ఒక సినిమా ఈవెంట్ లో కూడా ఎవరూ ఊహించని విధంగా కామెంట్ చేశారు. ప్రముఖ రచయిత కే.విజయేంద్ర ప్రసాద్ గడ్డం గురించి ఆయన చేసిన కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక రాజమౌళి పేరు కూడా ప్రస్తావించడం విశేషం.
 
 సునీల్ హీరోగా చేసిన ‘కనబడుటలేదు’ అనే సినిమా వేడుకకు వర్మతో పాటు విజయేంద్ర ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదికపై విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. 1989లో సినిమా మీద ప్యాషన్‌తో వచ్చి.. ఎవరి దగ్గరా పని చేయకుండానే కేవలం సినిమా మీద ప్రేమతో ‘శివ’ అనే చిత్రం తీసి సంచలనం సృష్టించి.. అప్పటి కుర్రాళ్లందరూ సైకిల్ ఛైన్లు పట్టుకుని తిరిగేలా చేసిన దర్శకుడు ఇప్పుడు కనిపించడం లేదన్నారు.

రంగీలా, సత్య, కంపెనీ లాంటి అద్భుతమైన సినిమాలు తీసి ఎంతోమందిని ఇన్‌స్పైర్ చేసి వందల మంది దర్శకులుగా మారడానికి కారణమైన డైరెక్టర్ ఇప్పుడు కనిపించడం లేదన్నారు. శ్రీదేవిని ఇంకెవరూ చూపించనంత అందంగా చూపించి.. ఆమెతో జామురాతిరి జాబిలమ్మ లాంటి పాట పాడించిన దర్శకుడు ఇప్పుడు కనిపించడం లేదన్నారు. ఆ దర్శకుడిని మళ్లీ చూడాలనుందని.. ఆయన కనిపిస్తే బాగుంటుందని వర్మ  పై కౌంటర్లు వేశారు విజయేంద్ర ప్రసాద్. దీనికి కిందున్న వర్మ ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉన్నాడు. తర్వాత వేదిక మీదికి వచ్చినపుడు విజయేంద్ర కామెంట్ల మీద వర్మ ఏమీ స్పందించలేదు. టాపిక్‌ను డైవర్ట్ చేస్తూ విజయేంద్ర గడ్డంని టార్గెట్ చేసారు.

వర్మ మాట్లాడుతూ... వేడుకకు విచ్చేసిన అందరికీ, వేదికను అందించిన పెద్దలందరికీ నమస్కారం చెప్పట్లేదు. ఎందుకంటే నా లైఫ్ లో ఎప్పుడు ఎవరికి నమస్కారం పెట్టింది లేదు. అది అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఈ సందర్భంగా కనబడుటలేదు గురించి మాట్లాడటానికి ముందు నాకు ఒక డౌట్. ఇందాక రైటర్ విజయేంద్రప్రసాద్ గారిని ఒక విషయం అడుగుదామని అనుకున్నా కానీ మ్యూజిక్ ఎక్కువగా ఉండడం వలన ఆయనకి అర్థం కాదేమో అని చెప్పలేదు. 

గత కొన్ని వారాలుగా నేను విజయేంద్రప్రసాద్ గారిని గమణిస్తున్నాను. నా పెద్ద పెద్ద డౌట్ ఏంటంటే.. మీ గడ్డానికి స్ఫూర్తి ఎవరు? నరేంద్రమోడీనా? లేకపోతే రామాయణం మించిన అద్భుతమైన బాహుబలి కాదను ఇచ్చారు కాబట్టి వాల్మీకి కంటే పెద్దగా ఉండాలని అనుకున్నారా? ఇక నా గెస్సింగ్ ఏమిటంటే.. బోడి నా కొడుకు రాజమౌళిదే అంత ఉంటే నాది ఇంకెంత పెద్దగా ఉండాలి.. అది నా కరెక్ట్ అని నా ఫీలింగ్ అని దర్శుకుడు రామ్ గోపాల్ వర్మ చాలా ఓపెన్ గా క్లారిటీ ఇచ్చారు. ఇక ఆ మాటలకు రైటర్ విజయేంద్రప్రసాద్ నవ్వుతూనే ఆర్జీవికి రెండు చేతులెత్తి నమస్కారం చేశారు.  వర్మ మాటలకు అక్కడ జనాలు విజిల్స్ వేసి క్లాప్స్ కొట్టారు. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?