మమ్ముట్టిపై కేసు నమోదు, కోవిడ్ రూల్ పై..

By Surya PrakashFirst Published Aug 9, 2021, 3:51 PM IST
Highlights

రూల్స్  ఉల్లంఘించినందుకు ప్రముఖ మలయాళీ నటుడు మమ్ముట్టితోపాటు మరో 300 మందిపై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో మరో నటుడు రమేశ్‌ పిషరోడీ కూడా ఉన్నారు.  

దేశ జనాభాలో 3 శాతం ప్రజలున్న కేరళలో, ప్రస్తుతం దేశవ్యాప్తంగా నమోదవుతోన్న కేసుల్లో సగానికి పైగా కేసులు అక్కడి నుంచే వస్తూండటంతో అక్కడ చాలా స్ట్రిక్ట్ గా రూల్స్ ని ప్రభుత్వం పాటిస్తోంది. కేరళలో వైరస్ సోకిన వ్యక్తి నుంచి ఇతరులకు ఇన్ఫెక్షన్ వేగంగా వ్యాపిస్తోంది. ఈ పరిస్థితి కట్టడికి లాక్‌డౌన్‌ విధించడంతోపాటూ ఇతర చర్యలు తీసుకుంటోంది.

కరోనా కు సంభందించిన రూల్స్  ఉల్లంఘించినందుకు ప్రముఖ మలయాళీ నటుడు మమ్ముట్టితోపాటు మరో 300 మందిపై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో మరో నటుడు రమేశ్‌ పిషరోడీ కూడా ఉన్నారు.  ఈ నెల మూడో తేదీన కోజికోడ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నిర్వహించిన కార్యక్రమానికి మమ్ముట్టి, రమేశ్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 

రోబో సాంకేతికత ఆధారంగా కీళ్లమార్పిడి శస్త్రచికిత్స సేవలు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో స్థానికులు హాజరయ్యారని.. ఆస్పత్రి యాజమాన్యం కొవిడ్‌ నిబంధనలు పాటించడంలేదంటూ ఓ వ్యక్తి పోలీసుకుల ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు మమ్ముట్టి, రమేశ్‌తోపాటు ఆస్పత్రి బృందంపై కూడా కేసు నమోదు చేశారు.

ఈ వ్యవహారంపై స్పందించిన ఆస్పత్రి యాజమాన్యం.. ఆస్పత్రి ఆవరణలో కొవిడ్‌ నిబంధలు పాటించామని, సామాజిక దూరం ఉండేలా అన్ని రకాల చర్యలు తీసుకున్నామని పేర్కొంది.కాకపోతే కార్యక్రమం అనంతరం మమ్ముట్టి బయటకు రాగానే వందలాది మంది ఆయన్ని చూసేందుకు గుమిగూడారని వివరించింది. 
 

click me!