రతన్ టాటాను రాష్ట్రపతిని చేయండి: తెలుగు సినీ నటుడు నాగబాబు

Published : Aug 09, 2021, 03:34 PM IST
రతన్ టాటాను రాష్ట్రపతిని చేయండి: తెలుగు సినీ నటుడు నాగబాబు

సారాంశం

ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాను రాష్ట్రపతిని చేయాలని సినీ నటుడు నాగబాబు కోరారు. దేశాన్ని కుటుంబంలా ముందుకు నడిపించగల శక్తి రతన్ టాటాకు ఉందని, దయాగుణం కలవారని ఆయన అన్నారు.

హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాను రాష్ట్రపతిగా చేయాలని తెలుగు సినీ నటుడు నాగబాబు కోరారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఈ విజ్ఞప్తి చేశారు. దేశం క్లిష్టపరిస్థితిలో ఉందని, ఇటువంటి సమయంలో రాజకీయాల కోసం ఎత్తులు వేసేవారిని కాకుండా దేశాన్ని కుటుంబంలా చూసుకునే వ్యక్తి రాష్ట్రపతిగా ఉండాలని ఆయన అన్నారు.

 

రాష్ట్రపతిగా రతన్ టాటా పేరును తాను ప్రతిపాదించడానికి గల కారణాలపై నాగబాబు ప్రముఖ టీవీ చానెల్ ఎన్టీవీతో మాట్లాడారు. పారిశ్రామిక రంగంలో రతన్ టాటా అద్భుతమైన కృషి చేశారని అన్నారు. తన ట్రస్టు ద్వారా దేశానికి ఎంతో సేవ చేశారని కూడా చెప్పారు. రతన్ టాటాది గొప్ప వ్యక్తిత్వమని అన్నారు. 

కరోనా వ్యాధి వ్యాప్తి చెందినప్పుడు చాలా సాయం అందించారని, అవసరమైతే తన యావదాస్తిని కూడా ఇస్తానని అన్నారని నాగబాబు వివరించారు. రతన్ టాటాను రాష్ట్రపతిని చేస్తే బిజెపికి కూడా మంచి పేరు వస్తుందని అన్నారు. రతన్ టాటాది గొప్ప వ్యక్తిత్వమని అన్నారు. 

రతన్ టాటా వివాదరహితుడని, దయాగుణం కలవారని, దేశాన్ని అద్భుతంగా ముందుకు నడిపించగల శక్తి రతన్ టాటాకు ఉందని ఆయన అన్నారు. రతన్ టాటాకన్నా సమర్థులు లేరని తాను అనడం లేదని, కానీ రతన్ టాటా వ్యక్తిత్వం తనకు నచ్చిందని ఆయన అన్నారు కలాం తర్వాత దేశానికి రాష్ట్రపతిగా ఉండదగిన వ్యక్తి రతన్ టాటా అని అన్నారు. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?