నా ఫ్యాన్స్ తిట్టారు.. నేను బాధపడ్డా.. రాశిఖన్నా కామెంట్స్!

Published : Feb 07, 2020, 10:00 AM IST
నా ఫ్యాన్స్ తిట్టారు.. నేను బాధపడ్డా.. రాశిఖన్నా కామెంట్స్!

సారాంశం

'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా టీజర్ లో విజయ్ తో రాశిఖన్నా లిప్ లాక్, నగ్నంగా స్నానం చేస్తున్న సీన్లు ఉన్నాయి. ఇవి చూసిన తరువాత రాశిఖన్నా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో కూడా దీనిపై విపరీతంగా ట్రోలింగ్ జరిగింది.

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది రాశిఖన్నా. తన ఖాతాలో హిట్స్ ఉన్నప్పటికీ స్టార్ ఫేమ్ ని మాత్రం దక్కించుకోలేకపోతుంది. తాజాగా ఈ బ్యూటీ 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలో నటిస్తోంది. ఇటీవల సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు.

ఈ వేడుకలో రాశిఖన్నా ఇచ్చిన స్పీచ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా టీజర్ లో విజయ్ తో రాశిఖన్నా లిప్ లాక్, నగ్నంగా స్నానం చేస్తున్న సీన్లు ఉన్నాయి. ఇవి చూసిన తరువాత రాశిఖన్నా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

బోల్డ్, సెక్స్ సీన్లు.. కావాలనే చేశానంటున్న రాశిఖన్నా!

సోషల్ మీడియాలో కూడా దీనిపై విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. తాజాగా ఈ విషయంపై రాశిఖన్నా స్పందించారు. సినిమా టీజర్ విడుదలైనప్పుడు విజయ్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందా..? అని అందరూ మాట్లాడుకున్నారని ఆ కామెంట్స్ బాగా ఎంజాయ్ చేశామని.. కానీ తన ఫ్యాన్స్ మాత్రం బాధపడ్డారని.. రాశి ఎందుకు ఇలా చేశావ్..? మాకు నచ్చలేదు అంటూ రకరకాల కామెంట్స్ చేశారని.. ఆ విషయంలో తను కూడా బాధపడినట్లు చెప్పింది.

అయితే తాను ఇప్పటివరకు చేసిన మంచి సినిమాల్లో ఇదొకటని చెప్పారు. ఇప్పటివరకు తాను చేయని పాత్ర ఈ సినిమాలో చేశానని చెప్పారు. ఈ సినిమా చూసిన తరువాత ప్రేక్షకుల అభిప్రాయం మారుతుందని.. ఇలాంటి పాత్ర చేసినందుకు తన ఫ్యాన్స్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారని.. అందరూ సినిమా చూసి ఆశ్చర్యపోతారని చెప్పింది. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?