'జాను' ట్విట్టర్ టాక్.. ఇలా చేశారేంటి?

prashanth musti   | Asianet News
Published : Feb 07, 2020, 08:38 AM IST
'జాను' ట్విట్టర్ టాక్.. ఇలా చేశారేంటి?

సారాంశం

ఫీల్ గుడ్ లవ్ స్టోరీ వచ్చి చాలా కాలమవుతోంది. అందుకే దిల్ రాజు ఎవరు ఎన్ని చెప్పినా పట్టించుకోకుండా 96 కథను తెలుగులో రీమేక్ చేశాడు. సమంత శర్వానంద్ జంటగా నటించిన 'జాను'సినిమా నేడు వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

టాలీవుడ్ లో ఫీల్ గుడ్ లవ్ స్టోరీ వచ్చి చాలా కాలమవుతోంది. అందుకే దిల్ రాజు ఎవరు ఎన్ని చెప్పినా పట్టించుకోకుండా 96 కథను తెలుగులో రీమేక్ చేశాడు. సమంత శర్వానంద్ జంటగా నటించిన 'జాను'సినిమా నేడు వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే సినిమాకు సంబందించిన టాక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

యూఎస్ లో పలు చోట్ల ప్రీమియర్స్ ని వీక్షించిన నెటిజన్స్ సినిమాపై భిన్నంగా స్పందిస్తున్నారు. ముందుగా సినిమాపై అంచనాలైతే గట్టిగా పెరిగాయి. జాను టీజర్ అండ్ ట్రైలర్ కి కి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక సినిమాలో అయితే మెయిన్ కథను యధావిధిగా ప్రజెంట్ చేసినప్పటికి కొంత సోల్ మిస్సయ్యిందనే కామెంట్స్ వస్తున్నాయి. ఇకపోతే మరికొందరు 96 సినిమా చూడని వారికి ఈ సినిమా చాలా బాగా నచ్చుతుందని చెబుతున్నారు.

ముందుగా దర్శకుడు పెద్దగా పొరపాటు చేయకుండా పాత్రలను ఎంచుకున్న విధానం చాలా బావుందని చెబుతున్నారు. ఇక మరికొందరైతే సినిమా కొన్ని వర్గాల వారికి మాత్రమే నచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కొన్ని ఏరియాల్లో దాదాపు థియేటర్స్ హౌజ్ ఫుల్ అయ్యాయని ట్వీట్ చేస్తున్నారు. పాజిటివ్ టాక్ ఎంత ఉన్నా కొంత నెగిటివ్ టాక్ కూడా వస్తోంది. మరీ జాను ఎంతవరకు క్లిక్ అవుతుందో చూడాలి. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకు సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించాడు.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?