వీధుల్లో హీరోయిన్ హల్ చల్.. ట్రాఫిక్ పోలీసులతో ఇలా..

By tirumala ANFirst Published Dec 12, 2019, 7:12 PM IST
Highlights

ప్రస్తుతం హీరోయిన్లంతా లేడి ఓరియెంటెడ్ చిత్రాలపై ఆసక్తి చూపుతున్నారు. సౌత్ లో నయనతార, అనుష్క శెట్టి, త్రిష, అమలాపాల్ లాంటి హీరోయిన్లు కమర్షియల్ చిత్రాల్లో నటిస్తూనే లేడి ఓరియెంటెడ్ చిత్రాలు కూడా చేస్తున్నారు. బాలీవుడ్ లోనూ ఈ ట్రెండ్ ఉంది.

ప్రస్తుతం హీరోయిన్లంతా లేడి ఓరియెంటెడ్ చిత్రాలపై ఆసక్తి చూపుతున్నారు. సౌత్ లో నయనతార, అనుష్క శెట్టి, త్రిష, అమలాపాల్ లాంటి హీరోయిన్లు కమర్షియల్ చిత్రాల్లో నటిస్తూనే లేడి ఓరియెంటెడ్ చిత్రాలు కూడా చేస్తున్నారు. బాలీవుడ్ లోనూ ఈ ట్రెండ్ ఉంది. క్రేజీ హీరోయిన్ రాణి ముఖర్జీ తాజాగా నటించిన చిత్రం 'మర్ధానీ 2'.  గోపి పుత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 13, శుక్రవారం రోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

దీనితో రాణి ముఖర్జీ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా గడుపుతోంది. యువతులపై అత్యాచార సంఘటనలు దేశంలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ కథాంశంతోనే మర్ధానీ 2 చిత్రం రూపొందింది. ఈ చిత్రంలో ఓ సైకో అమ్మాయిలపై అత్యాచారం చేసి, హత్య చేసే కేసుని చేధించే పోలీస్ అధికారిగా రాణి ముఖర్జీ నటిస్తోంది. 

ఈ చిత్ర ప్రచారంలో భాగంగా రాణి ముఖర్జీ ఆసక్తికరమైన కార్యక్రమం చేపట్టింది. ముంబై వీధుల్లో తిరుగుతూ వివిధ ప్రాంతాల్లోని ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ట్రాఫిక్ పోలీసులని కలుసుకుంది. రద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రజల సేఫ్టీ కోసం ఎలాంటి జాత్రత్తలు తీసుకుంటారో అడిగి తెలుసుకుంది. 

అనుమానంగా అనిపించిన ప్రతి వాహనాన్ని తాము తనిఖీ చేస్తామని తెలిపింది. ప్రాధమికంగా కొన్ని తనిఖీలు చేస్తాం. అందులో అనుమానం బలపడితే ఆ వాహనం పత్రాలని క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకుంటాం అని ఓ కానిస్టేబుల్ ఆమెకు వివరించారు. 

రాణి ముఖర్జీ మాట్లాడుతూ.. చాలా నేరాలని అరికట్టడంలో ట్రాఫిక్ పోలీసులు ప్రధాన పాత్ర వహిస్తుంటారు. నేడు వారిని కలుసుకోవడం, వివిధ అంశాల గురించి చర్చించడం జరిగింది. 

ముఖ్యంగా మహిళా ట్రాఫిక్ పోలీసులని ఎక్కువగా కలుసుకున్నా. వారు ఎలా శిక్షణ పొందారు, విధులు ఎలా నిర్వహిస్తున్నారు అనే అంశాలని అడిగి తెలుసుకున్నట్లు రాణి ముఖర్జీ తెలిపింది. మర్ధానీ 2 చిత్రం సీట్ల అంచుకు కూర్చుని చూసేలా ఉత్కంఠ రేకెత్తిస్తుందని చిత్ర యూనిట్ తెలిపింది. 

 

click me!