వర్మ పాట్లు.. పట్టించుకోని సెన్సార్ బోర్డు!

Published : Nov 28, 2019, 02:12 PM ISTUpdated : Nov 28, 2019, 02:15 PM IST
వర్మ పాట్లు.. పట్టించుకోని సెన్సార్ బోర్డు!

సారాంశం

ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌ కూడా ఈ సినిమా విడుదల అడ్డుకోవాలని హైకోర్టుని ఆశ్రయించారు. అయితే ఇప్పుడు ఈ సినిమా విడుదల విషయమై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హైకోర్టుని ఆశ్రయించారు.

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'కమ్మరాజ్యంలో కడపరెడ్లు'పలు వివాదాలకు మూలంగా మారింది. ఇప్పటికే ఈ సినిమా విడుదల ఆపాలంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌ కూడా ఈ సినిమా విడుదల అడ్డుకోవాలని హైకోర్టుని ఆశ్రయించారు. 

అయితే ఇప్పుడు ఈ సినిమా విడుదల విషయమై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హైకోర్టుని ఆశ్రయించారు. 'కమ్మరాజ్యంలో కడప రెడ్లు' సినిమా వివాదంపై వర్మ కోర్టులో పిటిషన్ వేశారు. తన సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేలా.. సెన్సార్ బోర్డ్ ని ఆదేశించాలని రామ్ గోపాల్ వర్మ కోర్టుని కోరారు.

మరో మహిళతో ఎఫైర్.. భార్యని టార్చర్ చేసిన సింగర్!

సినిమాను ఇప్పటివరకు సెన్సార్ బోర్డ్ చూడలేదని వర్మ చెప్పారు. రేపు సినిమా విడుదల ఉన్నా.. ఇప్పటివరకు  సర్టిఫికేట్ ఇవ్వలేదని వర్మ అభ్యంతరం చెబుతున్నారు. సెన్సార్ కార్యక్రమాలు గనుక ఇంకా పూర్తికాకపోతే వర్మ గత చిత్రాల మాదిరి ఈ సినిమా కూడా వాయిదా పడుతుందా లేక సెన్సార్ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా..? అనే విషయం ఆసక్తికరంగా మారింది.  నెల 29న ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?