షారుక్ నెక్స్ట్ మూవీ.. లిస్ట్ లోకి తెలుగు దర్శకులు?

By Prashanth MFirst Published Nov 28, 2019, 12:47 PM IST
Highlights

ఖాన్ నెక్స్ట్ సినిమా ఇప్పుడు బాలీవుడ్ పెద్ద హాట్ టాపిక్ అయిపొయింది. బాలీవుడ్ మీడియా రోజుకో కథనంతో షారుక్ పై అనేక రూమర్లు పుట్టిస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా షారుక్ ఖాన్ తన నెక్స్ట్ సినిమాపై సస్పెన్స్ క్రియేట్ చేస్తుండడంతో అభిమానుల్లో ఎన్నో రకాల అనుమానాలు కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేస్తున్నాయి.

షారుక్ ఖాన్ నెక్స్ట్ సినిమా ఇప్పుడు బాలీవుడ్ పెద్ద హాట్ టాపిక్ అయిపొయింది. బాలీవుడ్ మీడియా రోజుకో కథనంతో షారుక్ పై అనేక రూమర్లు పుట్టిస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా షారుక్ ఖాన్ తన నెక్స్ట్ సినిమాపై సస్పెన్స్ క్రియేట్ చేస్తుండడంతో అభిమానుల్లో ఎన్నో రకాల అనుమానాలు కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేస్తున్నాయి. గత నెలలో అట్లీ దర్శకత్వంలో షారుక్ సినిమా చేయబోతున్నట్లు టాక్ వచ్చిన విషయం తెలిసిందే.

సంఖి అనే టైటిల్ ని కూడా అనుకున్నట్లు ప్రచారాలు జరిగాయి. కానీ ఇంకా ఆ ప్రాజెక్ట్ గురించి డైరెక్టర్ హీరో నుంచి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ అయితే రాలేదు. ఇక ఆ తరువాత షారుక్ రాజ్ కుమార్ హిరాణితో కూడా ఒక సినిమాను అనుకున్నట్లు రూమర్స్ వచ్చాయి.  ఫైనల్ గా ఇప్పుడు వేరే ప్రాజెక్ట్ పై షారుక్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగువారైనా ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్స్ రాజ్ - డీకే ఇటీవల షారుక్ కి ఒక పాయింట్ చెప్పారట.

అది నచ్చడంతో వెంటనే కథను డెవలప్ చేయమని షారుక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. గతంలో ఈ డైరెక్టర్స్ కాంబో స్త్రీ అనే సినిమా చేసి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుంది.  ఇక ఇప్పుడు ఒక పెద్ద స్టార్ హీరోతో సినిమా చేయాలనీ ఈ తెలుగు వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే డిసెంబర్ ఎండింగ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటె క్రిస్మస్ అనంతరం షారుక్ తన కొత్త సినిమాకు సంబందించిన పూర్తి వివరాలను తెలియజేస్తానని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.

click me!